మేషరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకండి. భూమికి సంబంధించిన విషయాలలో మీరు తలదూచకుండా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
వృషభరాశి: నూతన పరిచయాలు పెరుగుతాయి!
నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల బాతులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దేవదర్శనాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.
మిధునరాశి: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి!
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాల్లో పెట్టుబడి విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చ చేయడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇతరుల నుండి మీ సొమ్ము రావడం ఆలస్యం అవుతుంది. తరచూ మీరు నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది!
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. కొన్ని వ్యవహారాల్లో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. వ్యాపార ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
సింహరాశి: కీలక సమయాల్లో సోదరుల నుండి సహాయం అందుతుంది!
కీలక సమయాల్లో సోదరుల నుండి సహాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్నా అవకాశాలు లభిస్తాయి. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
కన్యరాశి: బయట బాధ్యతలు పెరుగుతాయి!
బయట బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత చికాకు తప్పదు. కుటుంబ వ్యవహారాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. తరచు నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
తులరాశి: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు!
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులకు కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సంప్రదిస్తారు. నిరుద్యోలకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృశ్చికరాశి: బందు వర్గం వారితో విభేదాలు తప్పవు!
బంధు వర్గం వారితో విభేదాలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి రావు. సంతానం విద్య విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమపడిన ఫలితం అంతగా కనిపించదు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బయట ఊహించని పరిచయాలు ఏర్పడతాయి
ధనుస్సురాశి: నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి!
నూతన అవకాశములు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు అంతా మంచే జరుగుతుంది.
మకరరాశి: మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు!
మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకారాలను దాయి ఆకస్మిక ధనలాభాల సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.
కుంభరాశి: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది!
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. గణపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
మీనరాశి: మిత్రులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి!
మిత్రులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక ఈ విషయాలపై దృష్టి చరిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతి బంధకాలుతప్పవు. ఉద్యోగస్తులకు ఒక వ్యవహారాల్లో అధికారుల నుండి సమస్యలు ఎదుర్కొంటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరివి నిమిషాల్లో వాయిదా పడతాయి. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.