Today Horoscope: నవంబర్ 4వ తేదీ గురువారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: సహాయం చేయాలన్న గుణం ఉంటుంది!

ఈరోజు కొన్ని ఆస్తులు కొనుగోలు చేయటానికి బాగా ప్రయత్నాలు చేస్తారు. కొందరి ప్రముఖుల వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల నుండి ధనం లభిస్తుంది. పేదవారికి సహాయం చేయాలన్న ఆలోచనలో ఉంటారు. వృత్తి వ్యాపారాలల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాలనుకున్న వారికి ఇది మంచి సమయం.

వృషభరాశి: డబ్బులు సంపాదించడానికి మార్గాలు చూస్తారు!

మీరు కుటుంబ విషయాల పట్ల బాగా దృష్టి పెడతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరింత డబ్బులు సంపాదించడానికి మార్గాలు ఎంచుకుంటారు. ఆగిపోయిన పనులు పూర్తి చేయటానికి ముందుకు వస్తారు. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.

మిధునరాశి: తొందర నిర్ణయాలు తీసుకోవద్దు!

మీరు చేసే పనులలో న్యాయం ఉంటుంది. కొందరి వ్యక్తుల స్వభావాలు మిమ్మల్ని నిరాశ పెడుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువవుతుంది. శత్రువులను మీ దరికి చేరకుండా చూసుకోవాలి.

కర్కాటక రాశి: తోబుట్టువుల వాదనలు ఎదురవుతాయి!

కోల్పోయిన ఆస్తులు పొందటానికి బాగా ప్రయత్నాలు చేస్తారు. సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో పై స్థానాన్ని పొందుతారు. తీర్థయాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. తోబుట్టువులు వాదనలకు దిగే అవకాశం ఉంది. మీ మాటతీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. గిట్టని వారు మీ పై మరింత దండయాత్ర చూపిస్తారు.

సింహరాశి: తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు!

బంధుమిత్రులతో అనవసరమైన గొడవలకు దిగుతారు. నూతన పనులు ప్రారంభించడానికి రానున్న రోజులు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు గందరగోళంగా ఉంటుంది. ఇతరుల మాటలను తొందరగా నమ్మకండి. పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.

కన్యరాశి: అధిక లాభాలు అందుకుంటారు!

మీరు చేసే వ్యాపారాలలో అధిక లాభాలు అందుకుంటారు. ఏ పని చేసిన ఇతరుల సహాయం అందుకుంటారు. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయకూడదు. సమయానికి రావలసిన డబ్బు వాయిదా పడుతుంది.

తులరాశి: విలువైన బహుమతులు అందుకుంటారు!

సమాజంలో మంచి గౌరవ మర్యాదలు అందుతాయి. మీ చిరకాల కోరికలు తీరుతాయి. విలువైన బహుమతులు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్తారు. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి. మీ జీవితంలోకి ఒక వ్యక్తి పరిచయం అవుతారు.మీ చిన్ననాటి స్నేహితుడు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది.

వృశ్చికరాశి: ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి!

కొన్ని వివాదాలు కుటుంబ సభ్యులను దూరం చేస్తాయి. దీని వల్ల చాలా బాధపడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా బాధపడతాయి. రానున్న రోజుల్లో మంచి జరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం.

ధనుస్సురాశి: ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి!

కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఒక పరిచయం మీ జీవితానికి వెలుగునిస్తుంది. ఆర్థిక లాభాలు ఎక్కువగానే ఉన్నాయి. సొంత నిర్ణయాలు బాగుంటాయి. ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారం పొందే అవకాశం ఉంది. సంతోషకరమైన జీవితం గడుపుతారు. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

మకరరాశి: రెట్టింపు ధనాన్ని సంపాదిస్తారు!

విద్యార్థులు పోటీ పరీక్ష కోసం బాగా కష్టపడతారు. కొన్ని కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఎంత ఖర్చు చేసిన అంతకు రెట్టింపు ధనాన్ని సంపాదిస్తారు. ఒక శుభవార్త వింటారు. అనుకున్న సమయానికంటే ముందుగానే పనులు పూర్తి చేస్తారు. దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు. చేసే పనులలో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి.

కుంభరాశి: అనవసరమైన వాదనలకు దిగుతారు!

మొదలు పెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవటంతో ఇబ్బంది పడతారు. దీనివల్ల ఇతరులపై కోపాన్ని చూపిస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగుతారు. ఆర్థికంగా అంతగా ఇబ్బందులు కనిపించవు. శత్రువులను వీలైనంత దూరం పెట్టాలి.

మీనరాశి: సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు!

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. మీ పాత బాకీలు తీరుతాయి. నూతన ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. రాజకీయ ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పెరుగుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి. ఈ రోజు మంచి సమయాన్ని గడుపుతారు.