ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశుల్లోనూ భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో సెప్టెంబర్ 3న వచ్చే పరివర్తన ఏకాదశి శ్రీమహావిష్ణువు భక్తులకు విశేష ఫలితాలను అందించే రోజు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి, నెయ్యితో దీపం వెలిగించి, విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగి, శుభయోగాలు కలుగుతాయని విశ్వాసం.
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ ఏకాదశి ప్రభావం కొన్నిరాశుల వారికి అద్భుత ఫలితాలను ఇవ్వనుందిని విశ్వాసం. ముఖ్యంగా ఊహించని విధంగా ధనలాభాలు చేకూరతాయని చెబుతున్నారు. గతంలో ఆశించినా రాకపోయిన సంపద, ఆస్తులు ఈ కాలంలో లభిస్తాయని పండితులు అంటున్నారు. వృచ్చిక రాశి వారికి రాదనుకున్న డబ్బులు అకస్మాత్తుగా చేతికి చేరతాయని. మీన రాశి వారికి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు కనిపిస్తాయని చెబుతున్నారు. కొత్తగా భూములు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉందని పండితులు అంటున్నారు. ఇక విదేశీ అవకాశాలూ ఈ ఏకాదశి ప్రభావంతో తలుపుతడతాయని చెబుతున్నారు.
ఇక కన్య రాశి వారికి చదువు, ఉద్యోగం, వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. సంఘంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితులు, స్నేహితులకు కూడా మీ వల్ల లాభాలు కలుగుతాయంట. రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని పదవులను అధిరోహించే అదృష్టం కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించి సంతోషాన్ని అందుకుంటారు.
ఈ ఏకాదశి ప్రభావంతో ఈ రాశుల వారికి సంతాన సౌభాగ్యం విషయంలోనూ సానుకూల ఫలితాలు ఇస్తుంది. పిల్లల నుండి శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. భార్య తరఫున ఆస్తులు దక్కుతాయి. కోరుకున్న వివాహ సంబంధం కుదురుతుంది. ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదృష్టవశాత్తూ కొందరికి లాటరీలు తగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
పరివర్తన ఏకాదశి ఆధ్యాత్మికంగా మహా ప్రాధాన్యం కలిగిన రోజే కాకుండా, జ్యోతిష్యపరంగా కూడా అనూహ్యమైన లాభాలను కలిగించే శుభతిథి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి విష్ణుమూర్తిని ఆరాధిస్తే, ధనలాభాలతో పాటు జీవితంలో స్థిరత్వం, ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనం పండితులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)
