Today Horoscope: నవంబర్ 5వ తేదీ శనివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు!

మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. వాహనం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు. అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయకండి.

వృషభరాశి: అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు!

మీపై ఉన్న బాధ్యతలు నిర్లక్ష్యం చేస్తారు. మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు. ఇతర వారిపై కోపం కుటుంబ సభ్యులపై చూపిస్తారు. అనవసరంగా ఎవరో చెప్పిన మాటలకు మోసపోకండి. నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

మిధునరాశి: బంధువుల నుండి సంతోషకరమైన వార్త వింటారు!

మీరు కొన్ని కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. బయట కొన్ని కొత్త పరిచయాలు మొదలవుతాయి. మీరు చేసే ఉద్యోగంలో పై అధికారుల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి!

మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా త్వరగా పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.కొన్ని విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.

సింహరాశి: వాహనం కొనుగోలు ప్రయత్నాలు పలిస్తాయి!

మీరు ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు. వాహనం కొనుగోలు చేద్దామనే ప్రయత్నాలు ఈరోజు విజయవంతంగా పూర్తి అవుతాయి. తోబుట్టువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి: అనారోగ్య సమస్యలు బాధపెడతాయి!

మొదలు పెట్టిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇతర వాటిపై కాకుండామీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి. మీ పాత స్నేహితుల ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి వస్తారు. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తులరాశి: మీరు చేసే పనుల్లో చికాకులు తప్పవు!

మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులు జరగడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేయకపోవడమే మంచిది. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు. ఇతరుల విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.

వృశ్చికరాశి: తొందరపాటు నిర్ణయాలు పనికిరావు!

మీరు చేసే పనుల్లో మీ నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధనుస్సురాశి: ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది!

మీరు ఎప్పటినుండో నిలిపి వేయబడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు. భూమి కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ మాటలు ఇతరులను ఆకట్టుకుంటారు. మీ స్నేహితులతో ఈరోజు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన మంచి జరుగుతుంది.

మకరరాశి: మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా చూపిస్తారు!

ఈరోజు ప్రారంభించిన పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు. అనవసరంగా గొడవలకు దిగుతారు. ఇతరుల మాటలు ఈరోజు మీ మనసుని మిమ్మల్ని నొప్పిస్తాయి. కుటుంబ సభ్యులతో కలసి ఆస్తికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభరాశి: తోబుట్టువులతో కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు!

ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈరోజు బాగా అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతో మొదలు పెట్టే పనుల్లో అంతా మంచే జరుగుతుంది.

మీనరాశి: పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు!

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పిల్లల చదువుపై మరింత దృష్టి పెడతారు. విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు. కొన్ని విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసే పనుల్లో ఇతరుల సహాయం మీకెప్పుడూ ఉంటుంది.