Today Horoscope: నవంబర్ 13వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: చదువు పట్ల దృష్టి పెట్టాలి!

ఇతర వాటిపై కాకుండా ఈ రోజు మీరు చదువుపై కూడా దృష్టి పెట్టాలి. ప్రారంభించిన పనులు ఈరోజు మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. బంధువుల నుండి రాకపోకలు జరుగుతాయి. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.

వృషభరాశి: శత్రువులకు దూరంగా ఉండాలి!

భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు తలదూర్చకుండా ఉండడం మంచిది. శత్రువులకు దూరంగా ఉండాలి. ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మిధునరాశి: సమాజంలో గౌర ప్రతిష్టాలను పొందుతారు!

రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి: కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి!

మీలో ఆందోళన ఈరోజు ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రారంభించిన పనులు ఈరోజు మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

సింహరాశి: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు!

పట్టుదలతో చేసే పనుల్లో మంచి విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. కొన్ని బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కన్యరాశి! ఉద్యోగ అవకాశం పొందుతారు!

కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగం ఈరోజు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

తులరాశి: ప్రారంభించిన పనుల్లో సమస్యలు ఎదుర్కొంటారు!

ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. చేసే పనిలో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

వృశ్చికరాశి: మీ తల్లి ఆరోగ్యం కుదుటపడుతుంది!

మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని కొత్త పలు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సురాశి: కోపాన్ని తగ్గించుకోవడం మంచిది!

ఈరోజు ఇతరులపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

మకరరాశి: స్నేహితుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు!

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది. స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయాలి.

కుంభరాశి: దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు!

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో బాధపడతారు. కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు.

మీనరాశి: చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి!

అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది. ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు. అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడమే మంచిది. బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.