Today Horoscope: డిసెంబర్ 9వ తేదీ శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి!

ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగోడిస్తుంది. ఇంటా బయట మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృషభరాశి: నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు!

నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చగలరు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.

మిధునరాశి: వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి!

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి మిత్రులతో చిన్నపాటి పట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఇంకా బయట నూతన సమస్యలు తప్పవు. మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కర్కాటక రాశి: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది!

వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతి లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మీ హోదా పెరుగుతుంది. విద్యార్థుల నూతన విద్యావకాశములు లభిస్తాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

సింహరాశి: ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది!

ఉద్యోగస్తులకు పని ఒత్తులు నుండి ఉపశమనం కలుగుతుంది. బంధుమిత్రుల సహాయం సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోండి.

కన్యరాశి: వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి!

వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాలి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాల్లో హాజరవుతారు. ఆదాయనికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

తులరాశి: నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు!

నిరుద్యోలకు ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అకారణం వివాదాలు కలుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటమే మంచిది.

వృశ్చికరాశి: సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది!

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సురాశి: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు!

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలో ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంకా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మకరరాశి: వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి!

వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. బందు వర్గంతో విభేదాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది. ఆదాత్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

కుంభరాశి: వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు!

వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు. వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఖర్చుల ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మీనరాశి: వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి!

వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాల అందుకుంటారు. ఉద్యోగమున నూతన ఉత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.