Today Horoscope: డిసెంబర్ 4వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: చేపట్టిన వ్యవహారాలు నిత్యాహంగా సాగుతాయి!

మీరు చేపట్టిన వ్యవహారాలు నిరుద్యోగంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం కనిపించదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.

వృషభరాశి: ప్రయాణంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి!

ప్రయాణంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సవ్వత ఆలోచనలు కలుగుతాయి. స్థిరాస్తి క్రమ విక్రమాలు లాభ సాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అసాజనకంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు మొదలవుతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

మిధునరాశి: వ్యాపార ప్రయత్నాలు పలుస్తాయి!

వృత్తి వ్యాపార ప్రయత్నాలు పలుస్తాయి. బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం నెలకొంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

కర్కాటక రాశి: విలువైన గృహోపకారాలను కొనుగోలు చేస్తారు!

విలువైన గృహోపకారాను కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తేలిక బయటపడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాలు అధికారుల సహాయం లభిస్తుంది. ప్రారంభించే పనుల్లో తొందరపాటు పనికిరాదు. స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సింహరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి బయట సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని దూర ప్రాణాలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొండి బాకిలని వసూలు చేస్తారు. సోదరులలో కొద్దిపాటి వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇతరుల విషయాలు మీరు జోక్యం చేసుకోకూడదు.

కన్యరాశి: ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి!

ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్య విషయాలు చర్చిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.

తులరాశి: ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి!

ఆదాయం మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరంగా కొన్ని ఇందులను ఎదుర్కొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఇతర పనులపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టడం మంచిది. మీ చిన్ననాటి మిత్రులకు కలుసుకుంటారు.

వృశ్చికరాశి: ప్రారంభించిన పనులను నిదానంగా పూర్తి చేస్తారు!

మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. అనుకోని చోటు నుండి డబ్బు చేతికి అందుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

ధనుస్సురాశి: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు!

మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతర వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు. మీరు చేసే ఉద్యోగంలో అలసట ఎక్కువగా ఉంటుంది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడం మంచిది.

మకరరాశి: విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు!

కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాలు పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి: దూర ప్రయాణాలను వాయిదా వేస్తారు!

సంతానం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొన్ని దూర ప్రయాణాలను మీరు వాయిదా వేస్తారు. మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది. మీ మాటలతో ఇతరుల మనసుని నొప్పిస్తారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

మీనరాశి: ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు!

రాజకీయ నాయకులు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని కొత్త పనుల ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు. ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.