Today Horoscope: డిసెంబర్ 13 వ తేదీ మంగళవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం!

పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృషభరాశి: నిరుద్యోగులకు అనుకోని విధంగా అవకాశములు లభిస్తాయి!

నిరుద్యోగ అనుకొని విధంగా లభించిన అవకాశంలను సద్వినియోగం చేసుకోవాలి. మిత్రుల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రుణ ఒత్తిడి నుండి బయట పడతారు. కొన్ని దూర ప్రయాణాలు మీకు లాభసాటిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలుపెట్టిన అంతా మంచే జరుగుతుంది.

మిధునరాశి: అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది!

అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఆదాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కర్కాటక రాశి: అధికారులు అనుగ్రహాలతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి!

అధికారులు అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. భూ క్రమ విక్రమాల్లో లాభాలు అందుకుంటారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి: ఇతరులకు సైతం సహాయం సహకారాలు అందిస్తారు!

ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇంకా బయట సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితులు నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోలకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూర ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి.

కన్యరాశి: విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు!

విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు సకలంలో పూర్తి అవుతాయి. కీలక సమయాల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు. బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

తులరాశి: పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు!

పాత మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘ కాలిక రుణాలు తీరుస్తారు. మీరు చేసే ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికరాశి: దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు!

దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘం గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానానికి విద్య ఈ విషయాలు పై దృష్టి సారించడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాల్లో సమస్యల నుండి బయటపడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుండి రావలసిన సొమ్ము సమయానికి చేతికి అందుతుంది.

ధనుస్సురాశి: వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఆకారణ వివాదాలు కలుగుతాయి!

వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఆకరణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. దూర ప్రాంతాల స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మకరరాశి: బంధుమిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు!

బంధుమిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అసభ్య చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

కుంభరాశి: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు!

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగుల సహోద్యోగులతో వివాదాలు తొలగుతాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. అన్ని రంగాల వారికి అనుకూల కాలం ఉంటుంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనరాశి: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు!

ఆదాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. గృహాల్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టే విషయాలు పునరాలోచనలు చేయడం మంచిది. మీ చిన్ననాటి స్నేహితులని కలుసుకుంటారు.