Today Horoscope: డిసెంబర్ 12వ తేదీ సోమవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి!

నిరుద్యోలకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాల విజయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించినా రీతిలో ఉంటాయి. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

వృషభరాశి: చేపట్టిన పనులలో శ్రమధిక్యత కలుగుతుంది!

చేపట్టిన పనుల్లో శ్రమధిక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారములు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి సమస్యలు కలుగుతాయి. సన్నిహితులతో ఆకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కొందరి ముఖ్యమైన వ్యక్తిని మీరు కలుస్తారు. ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

మిధునరాశి: వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు క్రమ క్రమంగా తొలుగుతాయి!

వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు క్రమ క్రమంగా తొలుగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన గృహ యోగములు ఉన్నవి. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసి వస్తాయి. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలు పెట్టిన అంతా మంచే జరుగుతుంది.

కర్కాటక రాశి: నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు!

నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా అవకాశములు లభిస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఉద్యోగులకు నూతన పదవులు లభిస్తాయి. వ్యాపారమున లాభాలు కలుగుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

సింహరాశి: దైవ సంబంధిత విషయాలు ఆసక్తి పెరుగుతుంది!

దైవ సంబంధిత విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్యరాశి: సంతాన విద్య విషయాల్లో ఊహించని సమస్యలు కలుగుతాయి!

సంతాన విద్య విషయంలో ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార ఉద్యోగాల్లో ఆందోళనలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆకారణ కలహాలు సూచనలు ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

తులరాశి: వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి!

వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలంగా సమయం ఉన్నత విద్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది.

వృశ్చికరాశి: చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది!

చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది. సోదరులతో స్తిరస్థి ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సురాశి: దూర ప్రయాణాలు అవరోధాలు కలుగుతాయి!

దూర ప్రయాణాల అవరోధాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. మానసిక ప్రశాంతతకు దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మకరరాశి: వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు!

వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తల దూర్చకుండా ఉండడమే మంచిది. మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కుంభరాశి: భూ సంబంధిత క్రమ విక్రమాలు లాభసాటిగా సాగుతాయి!

భూ సంబంధిత క్రమ విక్రమాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీనరాశి: చేపట్టిన పనులందు శ్రమ అధికమవుతుంది!

చేపట్టిన పనులందు శ్రమ అధికమవుతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యసూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దాయాదులతో స్తిరస్థి విషయమే ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు