సాధారణంగా యుక్త వయసు రాగానే యువతీ యువకులకు వివాహం చేయాలని తల్లితండ్రులు ఎంతో ఆశ పడుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సరైన సంబంధం కుదరక వారి పిల్లల వివాహానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇలా వివాహం విషయంలో ఆటంకాలు ఏర్పడటానికి యువతీ యువకుల జాతకంలోని దోషాలు కూడా ఒక కారణం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జాతకంలో ఉన్న కుజ దోషం, గురు, శుక్ర గ్రహాలు దృష్టి అశుభంగా ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. జాతక దోషాల వల్ల వివాహానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దోషాలకు పరిష్కారాలు కూడా చెప్పబడ్డాయి. యువతీ యువకుల వివాహానికి ఆటంకం ఏర్పడడానికి గల కారణాలు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.
కుజ దోషం: జ్యోతిష శాస్త్ర ప్రకారం యువతీ యువకుల జాతకంలో కుజదోషం ఉండటం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. కుజదోషం ఉన్న యువతీ యువకులు కుజదోషం ఉన్న వారిని వివాహం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వారి జాతకంలో ఉన్న కుజదోష ప్రభావం తొలగిపోయి వివాహానంతరం వారి జీవితం సంతోషంగా సాగిపోతుంది.
జాతకంలో గురువు బలహీనత: దేవ గురు బృహస్పతి వివాహానికి వైవాహిక జీవితంలో సంతోషానికి కారకంగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణించబడింది. ఇలా వివాహానికి కారకంగా ఉన్న బృహస్పతి గ్రహం వ్యతిరేక గ్రహంలో ఉండటంవల్ల ఆ వ్యక్తి వివాహానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి.
శుక్ర గ్రహం బలహీనత : ఒక వ్యక్తి జాతకంలో శుక్ర గ్రహం ఆనందం, అందానికి కారకంగా పరిగణించబడుతుంది. పురుషుని జాతకంలో శుక్రుడు స్త్రీకి కారకుడిగా అలాగే స్త్రీ జాతకంలో గురుడు పురుషుడికి కారకునిగా ఉంటాడు. ఇలా స్త్రీ పురుషుల జాతకంలో శుక్రుడు బలహీన స్థానంలో ఉండటం వల్ల కూడా వివాహంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఇతర కారణాలు: జాతకంలో పితృదోషం ఉండటం లేదా సూర్యుడు, బుద్ధుడు బృహస్పతి లగ్నంలో 12వ ఇంట్లో ఉండటం, అలాగే నవాంశ కుండలిలో దోషాలు ఉండటం వల్ల కూడా వివాహానికి ఆలస్యం అవుతుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దోషాలకు నివారణ చర్యలు : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం యువతి యువకుల జాతకంలో కుజ దోషం ఉన్నట్లయితే ప్రతి మంగళవారం శ్రీ మంగళ చండికా స్త్రోత్రాన్ని పటించాలి. అలాగే కుజదోషం ఉన్నవారు ప్రతిరోజు రావి చెట్టుకు నీరు పోయాలి. ప్రతి మంగళవారం రోజున హనుమంతుడికి పచ్చిమిర్చి, బెల్లం, శనగలు సమర్పించి పూజించాలి. అలాగే గురువారం రోజున ఉపవాసం ఉంటూ అరటి చెట్టును పూజించటం వల్ల జాతకంలో ఉన్న కుజదోషం ప్రభావం తొలగిపోయి వివాహ గడియలు సమీపిస్తాయి.