వాస్తు శాస్త్రం ప్రకారం ఏడు గుర్రాల పెయింటింగ్ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా ఇంటిని అలంకరించుకోవడానికి వివిధ రకాలుగా బొమ్మలు, ఫోటో ఫ్రేమ్స్ ఉంచుకుంటాము. ఈ క్రమంలో చాలామంది గుర్రాల ఫోటోలను కూడా ఇంట్లో ఉంచుకుంటారు. ఇలా ఏడు గుర్రాలు ఉన్న ఫోటోలు ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మన ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం మన మీద మంచి లేదా చెడు ప్రభావాలను చూపిస్తుంది. ఏడు గుర్రాలు ఉన్న పెయింటింగ్ లేదా ఫోటోని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో? దానిని వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇల్లు లేదా ఆఫీసులో ఏడు గుర్రాల పెయింటింగ్ ని ఉంచటం వల్ల అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఏడుగురాళ్ల పెయింటింగ్ ఇంట్లో ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆనందం వెళ్లివిరుస్తుంది. అయితే వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం ఈ ఏడు గుర్రాల పెయింటింగ్ ని ఇంట్లో వాస్తు ప్రకారం మాత్రమే ఉంచుకోవాలి. ఇలా వాస్తు ప్రకారం ఉంచటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు మొదలవుతాయి.

ఏడు గుర్రాల పెయింటింగ్ ని ఇంట్లో ఉంచినట్లయితే తూర్పు దిశ వైపు ఉంచాలి. ఇలా ఉంచటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు వెలివిరుస్తాయి. అలాగే మీరు పని చేసే కార్యాలయంలో ఈ పెయింటింగ్ ని దక్షిణ దిశలో ఉంచాలి. గుర్రం నోరు లోపలి భాగంలో ఉండాలి. ఇలా చేయటం వల్ల వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా మీరు చేసే వృత్తిలో ప్రమోషన్స్ పొంది పైకి ఎదుగుతారు. ఇలా ఇంట్లోకాని కార్యాలయంలో కానీ ఏడు గుర్రాల పెయింటింగ్ నుంచి ఉంచుకునేవారు పొరపాటున కూడా అసంపూర్ణంగా ఉన్న పెయింటింగ్ ని ఉంచకూడదు పొరపాటున ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు మొదలై కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుంది.