అనుకున్న పనులు నెరవేరక ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే సరి?

సాధారణంగా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలు పరిగణించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సమస్యలు తీరకపోగా మరికొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే ఇలా తరచూ సమస్యలు ఎదురవటానికి మన జాతకంలో దోషాలు ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎలా జాతక దోషం వల్ల ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి వివిధ రకాల పరిష్కారాలు వివరించబడ్డాయి. చాలామంది వారి జీవితంలో అనుకున్న పనులు నెరవేరక పోవటంతో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఎలా అనుకున్న పనులు నెరవేరక ఇబ్బంది పడుతున్న వారికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక చక్కటి పరిష్కారం ఉంది.

సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా మందిని ఉద్యోగ సమస్య వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలా తరచూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలం అయ్యి నిరాశ చెందేవారు ఇంటర్వ్యూకి వెళ్లటానికి ముందు ఐదు ఎండు మిరపకాయలను తీసుకొని వాటిని ఇంటి గుమ్మంలో ఉంచండి. ఇలా ఏదైనా ముఖ్యమైన పనుల కోసం బయటకి వెళ్లేటప్పుడు ఆ ఎండమిరపకాయలపై మీ పాదాలను ఉంచి బయటకు వెళ్లడం ద్వారా అనుకున్న పనులు సక్రమంగా జరిగి చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.

అంతేకాకుండా ఎప్పుడు సవ్యంగా జరుగుతున్న పనులు కొన్ని సందర్భాలలో అనుకొని ఆటంకాల వల్ల నిలిచిపోతూ ఉంటాయి. అలాంటి సమయాలలో కూడా 21 మిరపకాయలను తీసుకొని వాటిని ఒక గిన్నెలో వేసి నీటితో నింపాలి. తర్వాత ఎండు మిరపకాయలు వేసిన ఆ నీటితో ఏడుసార్లు దిష్టి తీసి వెంటనే వాటిని ఎవరు సంచరించని ప్రదేశంలో పారబోయాలి. ఇలా ఎండుమిరపకాయలతో దిష్టి తీయడం వల్ల ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభం అయ్యి విజయవంతంగా పూర్తి అవుతాయి.
అంతేకాకుండా కొన్ని సందర్భాలలో చిన్నపిల్లలు తరచూ ఏడవటం జబ్బు పడుతూ ఉంటారు. అలాంటి సమయాలలో ఏడు ఎండుమిరపకాయలు తీసుకొని మూడు రహదారులు కలిసే ప్రదేశంలో పిల్లలని ఉంచి ఆ ఎండుమిరపకాయలతో దిష్టి తీసి పడేయాలి. ఇలా చేయటం వల్ల పిల్లలకు ఉన్న దిష్టి తొలగిపోయి వారు ముందులా ఉత్సాహంగా ఉంటారు.