Wife and Husband: భార్య, భర్తల మధ్య వయస్సు వ్యత్యాసం ఎందుకు ఉండాలో తెలుసా..

Wife and Husband: పెళ్లి అంటే నూరేళ్ళ పంట.. వివాహం జరిపించేప్పుడు భార్య వయస్సు కంటే భర్త వయస్సు ఎక్కువుగా ఉండేటట్లు చూస్తారు. అయితే అలా ఎందుకు చేస్తారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లిళ్లు అనేవి యవ్వనం లో ఉన్నప్పుడే జరుగుతాయి. ఆ వయసులో ఉన్నప్పుడు భార్య, భర్తలిద్దరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తారు. రోజులు మారే కొద్ధీ.. కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి.. యవ్వన దశ నుండి నెమ్మది నెమ్మదిగా వృద్ధాప్యం లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఇక వృద్ధులు అయినప్పుడు భర్తను చూసుకోవడానికి .. అతని అవసరాలని తీర్చడానికి కట్టుకున్న భార్యకి కాస్త ఓపిక అనేది ఉండాలి. అందుకనే భార్య వయస్సు భర్త వయస్సు కంటే చిన్నదిగా ఉండేటట్లు చూస్తారు.

అలాగే.. భార్య భర్తలిద్దరికి ఇగో ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. దీనివలన ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఏర్పడి గొడవలవుతాయి. అందుకే, ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉంటే ఆలోచనలలో మార్పులు వస్తాయి. ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైన సరే అర్ధం చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే.. హార్మోన్ ఇన్ బాలన్స్. భార్య – భర్తల మధ్య వయస్సు అనేది కనీసం 2 నుండో 7 సంవత్సరాల మధ్యనైనా ఉండాలి కానీ.. ఎక్కువ లేదా తేడా అయితే ఉండకూడదు. ఎందుకంటే, ఇద్దరి మధ్య ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. మగవాళ్లకంటే ఆడవాళ్లకే మెచూరిటీ లెవల్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆడవాళ్లు ఆచి తూచి ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకుంటారు. అంతే కాకుండా.. తెలివైన వారుకూడా. అలానే భార్య అనేది మానసికంగా చాలా దృడంగా ఉంటుంది. భర్త చనిపోతే భార్య తట్టుకుంటుందేమో కానీ, భర్త మాత్రం భార్య చనిపోతే తట్టుకోలేడు. అందుకే .. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని భార్య, భర్తల మధ్య వయసు తేడా పెట్టడం అనేది జరిగింది.