మీరు నిత్య యవ్వనంగా కనిపించాలంటే తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే!

ఈ రోజుల్లో చాలామంది చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలతో బాధపడుతూ మానసికంగా కృంగిపోతున్నారు. ఇంకో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పెళ్లి వయస్సు వచ్చేసరికే వృద్ధాప్య లక్షణాలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి గల ప్రధాన కారణాలను పరిశీలిస్తే జీవన విధానంలో వస్తున్న క్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు, తీవ్ర మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. కారణాలు ఏవైనా ఈ సమస్య నుంచి బయట పడాలంటే రోజువారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

ప్రతిరోజు ఉదయాన్నే టమోటో జ్యూస్ సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. టమోటాలో సమృద్ధిగా విటమిన్ ఏ, విటమిన్ సి విటమిన్ ఈ లభిస్తాయి కావున చర్మంపై వచ్చే ముడతలను తగ్గించి నిత్య యవ్వనంగా మారుస్తుంది. అలాగే ప్రతిరోజు సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు విటమిన్ సి సమృద్ధిగా కలిగిన ఉసరి రసాన్ని సేవిస్తే చర్మం అలర్జీలను తగ్గించి చర్మాన్ని సహజ కాంతివంతంగా చేయడంలో తోడ్పడుతుంది

బ్యూటీ విటమిన్ గా పిలవబడే విటమిన్ ఈ సమృద్ధిగా కలిగిన సన్ ఫ్లవర్ గింజలను, గుమ్మడి గింజలు, అవిసె గింజలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే చర్మ ఆరోగ్యానికి సహాయపడి వృద్ధాప్య లక్షణాలు తొలగించబడతాయి. ప్రోటీన్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా కలిగిన సాల్మన్ ఫిష్ ను వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఆహారంగా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా తయారవుతుంది.

ప్రతిరోజు ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ సేవిస్తే చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ సి, బీటా కెరోటిన్ సమృద్ధిగా లభించి దెబ్బతిన్న చర్మ కణాలను సరిచేసి చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే ప్రతిరోజు ఆరెంజ్, ద్రాక్ష ద్రాక్షను ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించి చర్మానికి సహజ మెరుపును అందిస్తాయి.