Summer Heat: వేసవి వచ్చిందంటే ఎండలు, వడగాలులు, చెమటలు, బాడీ డీహైడ్రేషన్, తలనొప్పి, విసుగు, చిరాకు.. ఇన్ని ఉంటాయి. ఇప్పుడు కొత్త సమస్య కరోనా. పోయినేడాది వచ్చి పోయింది.. ఈసారి కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.. వ్యాక్సిన్ కూడా వచ్చేసింది అనుకుంటున్న తరుణంలో సెకండ్ వేవ్ ఏకంగా సునామీలా విరుచుకుపడింది. ఎండల్లో తిరగకూడదు అంటే.. అసలు వెళ్లాలంటనే భయం పుట్టించేస్తోంది. అసలే ఎండల్లో ఆక్సిజన్ లెవల్స్ తక్కువ.. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ. బాడీలోకి ఇదే ఎక్కువగా వెళ్లి విసుగు, చిరాకు తెప్పిస్తుంది. మెదడులో కణాలు హీటెక్కి స్ట్రెస్ గా మారిపోయి నుంచి తలనొప్పి వరకూ తీసుకెళ్తుంది. ఈ స్ట్రెస్ ను తగ్గించుకోవాల్సిందే.
వేసవిలో ఎక్కువగా బాడీ డీ-హైడ్రేషన్ కు గురవుతూ ఉంటుంది. దీనికి కారణం వేసవిలో ఉష్ణోగ్రతలు. 35 డిగ్రీలు దాటితే మన శరీరం తట్టుకోలేదు. కానీ.. అంతకంటే ఎక్కువే నమోదవుతూండటం వల్ల స్ట్రెస్ పెరిగి చెమట వస్తుంది. దీంతో బాడీలో నీరు ఉండదు. దీంతో చర్మం చల్లగా మారి చిరాకు తెప్పించి తలనొప్పికి కారణమవుతుంది. అందుకే వేసవిలో ఎప్పుడు నీళ్లు తాగుతూనే ఉండాలి. లేదంటే బాడీ డీ-హైడ్రేషన్ కు గురై వడదెబ్బ తగులుతుంది. అక్కడి నుంచి జ్వరంలోకి తీసుకెళ్తుంది. అందుకే వేసవిలో 11 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లొద్దు అంటారు. ఈ సమయంలో సూర్యుడు ప్రచండ భానుడే అవుతాడు. ఆ వేడి తట్టుకున్నట్టు మనకు అనిపించినా మన శరీరం తట్టుకోలేదు.
ఎండల్లో తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, టోపీ, కూలింగ్ గ్లాస్ వాడటం ఉత్తమం. కళ్లకు అంత వేడి తగలడం కూడా మంచిది కాదు. ఇంత వేడి బాడీలో ఉండటంతో తిండి కూడా సరిగ్గా తినలేం. ఈ చికాకులన్నీ తలనొప్పి తెప్పిస్తాయి. ఒక్కోసారి వాంతులు అవుతాయి. జ్వరానికి కారణమవుతుంది. ఎలా లేదన్నా వేసవిలో మధ్యాహ్నం నిద్ర ఉత్తమం. బాడీ రిలాక్స్ అవుతుంది. మండే ఎండల్లో ఆక్సిజన్ లెవల్స్ కూడా తక్కువ ఉండడం కూడా తలనొప్పి తెప్పిస్తుంది. జనాల్లో గుంపులు గుంపులుగా ఉన్నా మనలో చికాకు, స్ట్రెస్ వస్తుంది. అక్కడ కూడా ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి. ఉంటున్న చోటులో నీడ ఉండాలి.. చెట్లు ఉంటే మరీ మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. అర్హత ఉన్న నిపుణుల అభిప్రాయాలకు పై వివరాలు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి పై కథనం విషయంలో ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.