చలికాలంలో వాతావరణ పరిస్థితుల దృశ్యం మనలో కొంత బద్ధకం, నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ఇలాంటి అసౌకర్య పరిస్థితుల నుంచి బయటపడాలంటే రోజు ఒక గ్లాస్ అంజీర రసాన్ని సేవిస్తే మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచడంలో సహాయ పడడమే కాకుండా గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం, జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.అంజీర పండ్లలో విటమిన్స్, మినరల్స్,ఫ్లవనోయిడ్స్, పాలిఫినోల్స్, యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. మన ఆరోగ్యానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్,
పిండిపదార్థాలు,సోడియం వంటివి తక్కువ ఉండడం ఈ పండు ప్రత్యేకత.
అంజీర పండ్ల రసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంజీర పండ్లు ను కొన్ని ప్రాంతాల్లో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. బాగా పండిన అంజీర పండ్లను తీసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని అందులో
జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్‌ను కొద్ది పరిమాణంలో వేసుకొని బాగా గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం ఒక గ్లాసుడు పరిమాణంలో సేవిస్తే అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మందగించిన శరీర జీవక్రియలు ఉత్తేజితమై రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది
పండులో పుష్కలంగా ఉన్న పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అంజీర పండు లో ఉన్న ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యలను తరిమికొడుతుంది. అంగస్తంభన, సంతానలేమి వంటి సెక్స్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ రసాన్ని సేవిస్తే దాంపత్య సుఖాన్ని మరింత పొందవచ్చు.
అంజీరలో ఒమేగా 3ఫ్యాటీ ఆమ్లం, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లం,సోడియం, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె సమస్యలతో బాధపడే వరకు మంచిది.