సమ్మర్లో ఎండ దెబ్బ నుంచి రక్షణ పొందాలంటే ఈ ఫ్రూట్ జ్యూస్ తాగాల్సిందే!

వేసవి సీజన్ లో మాత్రమే సమృద్ధిగా లభించే లిచీ
ఫ్రూట్స్ మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ ఇ , విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, యాంటీబయోటిన్ గుణాలు,విర్రిపోఫ్లేవిన్, పుష్కలంగా ఉన్నాయి. లిచీ ఫ్రూట్ పింక్ కలర్ లో గుండ్రంగా ఉండి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండడంతో పాటు లోపలి జెల్లీ లాంటి గుజ్జు మధురంగా ఉండడంతో అధిక నీటి శాతాన్ని కలిగి ఉండి వేసవిలో తలెత్తే డిహైడ్రేషన్ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది.

వేసవి సీజన్ లో లిచీ ఫ్రూట్ జ్యూస్ సేవిస్తే ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వేసవి తాపం వల్ల కలిగే వడదెబ్బ నుంచి రక్షణ కల్పించడమే కాకుండా ఎండవేడికి చర్మం పొడి వారడం, కమిలిపోవడం వంటి లక్షణాలను తొలగించి చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడంలో తోడ్పడుతుంది. లిచీ ఫ్రూట్స్ లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ ఈ కంటి సమస్యలను తొలగించి కంటి చూపులు మెరుగుపరుస్తాయి.

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉండే లిచీ ఫ్రూట్స్ ను లేదా జ్యూస్ ను తరచూ తీసుకుంటే రక్తప్రసరణ వ్యవస్థ అడ్డంకులను తొలగించి గుండెపోటు రక్తపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. అలాగే మెగ్నీషియం నాడీ కణ వ్యవస్థను ఉత్తేజపరిచి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి, జీవ నియంత్రణ ద్రవాలను ఉత్తేజపరిచి అవయవాల పని తీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అన్ని అవయవాలకు అవసరమైన ఆక్సిజన్, రక్త సరఫరాలో తోడ్పడుతుంది.

లిచీ ఫ్రూట్స్ లో ఉండే అత్యధిక ఐరన్, ఫోలిక్ ఆమ్లం విటమిన్ బి12 ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిలో సహాయపడి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది దాంతో తరచూ మనల్ని వేధించే చికాకు, అలసట నీరసం వంటి లక్షణాల నుంచి బయటపడవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది కావున లిచీ ఫ్రూట్స్ అధికంగా తింటే పేగు కదలికలను మెరుగుపరిచి జీర్ణశక్తిని పెంపొందించడంతోపాటు శరీరంలో చెడు వ్యర్ధాలను తొలగించి మలబద్దక సమస్యను దూరం చేస్తుంది.