పీరియడ్స్ మిస్ అవుతున్నాయా.. ఈ లడ్డూ తింటే ఆ సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చట!

ప్రస్తుతం మహిళల్లో చాలామంది పీరియడ్స్ సరైన సమయానికి రాకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లను సైతం ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఈ సమస్య చిన్న సమస్యనే అనిపించినా ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆలివ్ లడ్డూ తినడం వల్ల ఈ సమస్య సులువుగా దూరమయ్యే అవకాశం ఉంటుంది.

ఆలివ్ విత్తనాలు, తురిమిన కొబ్బరి, బాదం రేకులు, బెల్లం పొడి, యాలకుల పొడితో చేసిన లడ్డూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నువ్వుల బెల్లం లడ్డూలు మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. ఎంతోమంది మహిళలు ఈ చిట్కాను పాటించడం ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆలివ్ విత్తనాలు, ఆలివ్ ఆయిల్ తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

జీవక్రియ, రోగనిరోధక శక్తి, ఇన్సులిన్ సమస్య, జుట్టు రాలడం, చర్మం చిట్లడం లాంటి సమస్యలు ఆలివ్ గింజల ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్ లభించే అవకాశం అయితే ఉంటుంది. క్రమం తప్పకుండా పీరియడ్స్ మిస్ అయితే కొన్నిసార్లు ఇతర కారణాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మూల కారణాన్ని గుర్తిస్తే సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ప్రతి స్త్రీ రుతు చక్రం ప్రత్యేకంగా ఉంటుంది. ఒత్తిడి, బరువు తగ్గడం, గర్భ నిరోధక మాత్రలు, పీసీఓఎస్, ఊబకాయం కూడా పీరియడ్స్ మిస్ కావడానికి కారణమని చెప్పవచ్చు. ఈస్ట్రోజన్ అధికంగా ఉత్పత్తి అయినా పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.