అమ్మాయిలు అందంగా కనిపించాలి అంటే జుట్టు ఎంతో అవసరం జుట్టు ఒత్తుగా ఉంటేనే వారి అందం మరింత రెట్టింపు అవుతుంది అయితే ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం కారణంగా అలాగే మారిన ఆహారపు అలవాట్లకు అనుకూలంగా చాలా మంది జుట్టు రాలిపోతూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలా జుట్టు రాలిపోవడం కాకుండా ఇతరత సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలా జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడేవారు వత్తయిన జుట్టు కావాలంటే వారంలో ఒక్కసారి ఈ మిశ్రమాన్ని తలకు రాసి స్నానం చేస్తే చాలు అందమైన ఎత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.
సాధారణంగా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కాకుండా ఇంట్లో సహజ సిద్ధంగా తయారు చేసుకునే ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాయడం వల్ల ఎత్తైన జుట్టు మీ సొంతమవుతుంది. ఒక గిన్నెలో ఐదు టేబుల్ స్పూన్ల పెసలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నానబెట్టిన గింజలలోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసి మెత్తని మిశ్రమంలో తయారు చేసుకోవాలి ఈ మిశ్రమంలోకి ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలియబెట్టాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అంటే ఎలా రాయాలి ఇలా వారంలో ఒక్కసారి ఈ మిశ్రమాన్ని తలకు రాసి ఒక గంట తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేయటం వల్ల జుట్టు రాలే సమస్య మాత్రమే కాకుండా చుండ్రు సమస్యలు కూడా తగ్గిపోయి ఎంతో అందమైన ఎత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. అయితే ఈ మిశ్రమంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.