కొబ్బరినీళ్లు తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ దూరమవుతాయా?

creative-ways-to-use-coconut-oil-1440x810

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో కొబ్బరి నీళ్లు తాగి ఉంటారు. జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించిన సమయంలో వైద్యులు సైతం కొబ్బరి నీళ్లు తాగాలని సూచనలు చేస్తుంటారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. షుగర్ సమస్యతో బాధ పడేవాళ్లు సైతం పరిమితంగా కొబ్బరినీళ్లను తాగవచ్చు. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి.

జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మరింత మేలు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే విషయంలో కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి. డీహైడ్రేషన్‌, అలసట, నిస్సత్తువ, తలనొప్పి లాంటి సమస్యలు వేధిస్తుంటే కొబ్బరి నీళ్లు తాగితే మంచిది.

కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు ఉండగా పిండి పదార్థాలు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, మెగ్నీషియం, మాంగనీస, పొటాషియం, సోడియం, కాల్షియం లభిస్తాయి. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ఆల్కలీన్ గుణాలు అసిడిటీ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి.

అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్‌ నుంచి రక్షించడంలో కొబ్బరినీళ్లు తోడ్పడతాయి. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఈ నీళ్లలో ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన రైబోఫ్లేవిన్, థయమిన్, నియాసిన్, పైరిడాక్సిన్ విటమిన్లు, ఫోలేట్స్ లభిస్తాయి.