Cough: పొడి దగ్గు, కఫం దగ్గు వేధిస్తున్నాయా..? వంటింటి చిట్కాలతో తరిమేయొచ్చు..!!

Cough: దగ్గు సమస్య ఉందంటే ప్రశాంతత మనకీ ఉండదు.. ఇంట్లో వాళ్లనీ ప్రశాంతంగా ఉండనీయదు. ఎందుకంటే దగ్గుతో నోటి నుంచి వచ్చే గాలికి వేగం ఎక్కువ. క్రిములు కూడా అంతే వేగంగా వస్తాయి. అది ఎదుటివారికి ఇబ్బంది చేస్తుంది కూడా. ఇందులో పొడి దగ్గు, కఫంతో కూడిన దగ్గు ఉంటుంది. గాలి కాలుష్యం వల్ల శాసకోశ సమస్యలు తలెత్తి ఊపిరి ఆడనివ్వదు. దీంతో దగ్గు, కఫం సమస్యలొస్తాయి. అయితే.. వంటింటి చిట్కాలతో దగ్గుకు చెక్ పెట్టొచ్చు.

మన పెరట్లో పెరిగే తులసి మొక్క ఒక ఔషధ గని. తులసి ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. రోజుకి రెండు తులసి ఆకులు శుభ్రంగా కడిగి తింటే గాలి కాలుష్యం ద్వారా వచ్చే సమస్యల్ని తొలగించుకోవచ్చు. రోజూ భోజనం చేసిన తర్వాత కొంత బెల్లం ముక్క తింటే మంచిది. ఇది పొల్యూషన్‌తో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడమే కాకుండా బ్లడ్‌ను క్లీన్ చేస్తుంది కూడా.

దగ్గు సమస్యను తగ్గించడంలో వెల్లుల్లి పాత్ర కూడా ఎక్కువే. స్పూన్ వెన్నలో వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చేసిన ముద్దను కలిపి తింటే ఫలితం ఉంటుంది. చేదుగా ఉన్నా తప్పదు. అరగంటపాటూ నీరు తాగొద్దు. కొన్ని రోజులు ఇలా చేస్తే గొంతులో గరగర పోతుంది. గొంతులో కఫం ఉండి మాట్లాడేటప్పుడు గొంతుకు అడ్డం పడుతుంటే మనకే కాదు.. చుట్టూ ఉన్నవారికీ విసుగే. ప్రతిసారీ గొంతు సరిచేసుకోవడమూ ఇబ్బందే. దీనికి చెంచాడు తేనెలో అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి కలిపి తాగాలి. దీంత కఫం సమస్య తొలగిపోవడంతో పాటు మాట్లాడేటప్పుడు ఇబ్బంది ఉండదు.

పొడి దగ్గుకు తోడు కఫం కూడా ఉంటే పైన చెప్పిన నల్ల మిరియాలు, తేనె మిశ్రమానికి తోడు అల్లం కుడా కలపడం ఉత్తమం. ఈ మూడూ మిశ్రమాల మందు గొంతులోని వైరస్‌ను తొలగేలా చేస్తాయి. దీంతో గొంతు సమస్యను చక్కదిద్దుకోవడంతోపాటు దగ్గు దరి చేరకుండా ఉంటుంది. ఇంట్లోని వంటింట్లో, పెరట్లో ఇటువంటి మందులతో చక్కగా గొంతు సమస్యను పరిష్కరించుకుంటే మందుల అవసరం ఉండదు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆయా సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు తెలిపిన వివరాలనే అందించాం. అర్హత ఉన్న నిపుణుల అభిప్రాయాలకు పై కథనం ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆహార నిపుణులు, వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. గమనించగలరు.