నడుము చుట్టు కొవ్వు సమస్య వేధిస్తుందా.. ఈ చిట్కాతో సమస్యకు చెక్ పెట్టండి!

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుకూలంగా చాలా మంది అధిక శరీర బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇలా చాలామంది అధిక శరీర బరువు పెరగడమే కాకుండా నడుము చుట్టూ తొడల భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఎంతో అసౌకర్యవంతంగా ఉంటారు.ఇకపోతే ఇలాంటి సమస్యతో బాధపడేవారు డైట్ ఫాలో అవుతూ శరీర బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి డైట్ ఫాలో కావడం వల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడి ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి.

ఈ క్రమంలోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజసిద్ధంగా తయారు చేసిన పానీయాలను ప్రతిరోజు సేవించడం వల్ల నడుము చుట్టూ తొడలు భాగంలో పేరుకుపోయిన కొవ్వును చాలా తొందరగా కరిగించుకోవచ్చు. మరి ఈ పానీయం ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే.. ముందుగా ఒక గిన్నెలో గ్లాస్ నీటిని పోసి బాగా మరిగించాలి ఇవి మరుగుతున్న సమయంలో ఒక చక్క నిమ్మకాయను ముక్కలు ముక్కలుగా కోసి మరుగుతున్న నీటిలో వేయాలి. అలాగే కొద్దిగా అల్లం శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఇలా నీరు మరుగుతున్న సమయంలో ఒక పది పుదీనా ఆకులు వేసి మరో పది నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఈ నీరు గోరువెచ్చగా ఉన్న సమయంలో ఆ నీటిని వడబోసుకొని రుచికోసం కాస్త తేనె వేసుకుని తాగటం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా మన నడుము చుట్టూ తొడల భాగంలో అలాగే పిరుదుల భాగంలో పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగిస్తుంది. దీనివల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.