జీడిపప్పులో మన శరీర పోషణకు అవసరమైన విటమిన్స్ ,మినరల్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే జీడిపప్పులో మన గుండె ఆరోగ్యానికి అవసరమైన పొటాషియం ,మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ బి12, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినైల్స్, కెరోటినాయిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి అన్న విషయం చాలామందికి అవగాహన లేక జీడిపప్పు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చాలా మంది జీడిపప్పు ను తినడానికి ఆసక్తి కనబరచారు.
వైద్యుల సూచనల ప్రకారం మరియు తాజా అధ్యయన ప్రకారం వారానికి ఒకటి లేదా రెండు సార్లు రెండు గుప్పిళ్లు జీడిపప్పులు తినేవారిలో గుండె జబ్బు ప్రమాదం 20 నుంచి 23శాతం తక్కువగా ఉంటుందని తేలింది. దీనికి కారణం జీడిపప్పులో అధికంగా ఉండే మెగ్నీషియం మన శరీరం మరియు రక్తనాళాల్లో నిల్వ ఉండే చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే గుండె పనితీరును దెబ్బతీసే సోడియం మూలకం జీడిపప్పులో తక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచే పొటాషియం అధికంగా ఉంటుంది కావున రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి అధికారకపోటు సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
జీడిపప్పులో ఉండే క్యాల్షియం,మెగ్నీషియం ఎముకలు దృఢత్వానికి తోడ్పడి వృద్ధాప్యంలో వచ్చి ఆర్థరైటిస్, కీళ్ల సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి శరీరంలో క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారు జీడిపప్పును తింటే ఇందులో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి చెడు మలినాలను బయటికి పంపడంలో సహాయ పడుతుంది. జీడిపప్పులు అధికంగా ఉండే వీటమిన్ ఏ విటమిన్ ఈ చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.