ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది వేర్వేరు ఆరోగ్య సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫ్లావీ వైరస్ వల్ల వచ్చే చికున్ గున్యా వ్యాధి వల్ల కీళ్లు, కండరాల్లో తీవ్రమైన నొప్పి రావడంతో పాటు జ్వరం కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. జ్వరం కొన్నిరోజుల తర్వాత తగ్గిపోయినా చాలామందిని నొప్పులు మాత్రం వెంటాడుతూ ఉంటాయి.
ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిన వాళ్లకు ఈ సమస్య మరింత ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పవచ్చు. కీళ్లలో వాపు, నొప్పులు కొన్ని వారాల వరకు కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయి. కొంతమందిలో స్కిన్ రాషెస్ కనిపిస్తే మరి కొందరు తీవ్రమైన అలసటతో బాధ పడుతూ ఉంటారు. చికున్ గున్యా వ్యాధి బారిన పడితే ఆకలి తగ్గిపోవడంతోపాటు వాంతి, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మెడ పక్కన లేదా చెవులకు పక్కన లేదా దవడ కింద ఉండే శోషరస గ్రంధుల్లో వాపు కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. చికున్ గున్యా సమస్య వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. సూప్స్, కొబ్బరినీళ్లు, నిమ్మరసం తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. భోజనానికి కూడా లిక్విడ్స్ తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు.
వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవడంతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. పాలకూర, మెంతి వంటి ఆకుకూరలను డైట్ లో చేర్చుకుంటే ఈ సమస్యకు వేగంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు.