ప్రతిరోజు సేవించి టీ లో ఈ మార్పు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం?

health benefits of jaggery tea

మనలో చాలామందికి ఎక్కువగా టీ తాగే అలవాటు ఉంటుంది. ప్రతిరోజు వేడి వేడి టీ పానీయాన్ని సేవిస్తే ఆ మజానే వేరు కదా. నిపుణుల సూచన ప్రకారం చక్కెరతో చేసిన టీ కంటే బెల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు కారణం చక్కెరలో అత్యధిక క్యాలరీలు ఉండి అత్యల్పంగా ఫైబర్ లభిస్తుంది.కావున చక్కెర టీ ని ఎక్కువగా సేవిస్తే శరీరంలో అధిక కేలరీలు చేరి శరీర బరువు పెరిగే ప్రమాదముంది క్రమంగా ఉబకాయం, మధుమేహ, రక్త పోటు మరియు గుండెపోటు ప్రమాదాలకు దారి తీయవచ్చు.

ప్రతిరోజు టీ పానియంలో చక్కెరకు బదులు బెల్లం వినియోగిస్తే అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బెల్లంలో అత్యల్ప క్యాలరీలు ఉండి అత్యధికంగా ఫైబర్, ఐరన్ కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. కావున ప్రతి రోజు బెల్లం టీ సేవిస్తే శరీరంలో అత్యధికంగా ఉండే కేలరీలు తగ్గి శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది తద్వారా ఉభకాయ సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు.

ప్రతిరోజు చక్కెర టీ నీ ఎక్కువగా తాగే వారిలో డయాబెటిస్ వ్యాధి ప్రమాదం ఎక్కువేనని చెప్పొచ్చు. చక్కర లో అత్యధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో చేరి గ్లూకోస్ స్థాయిలను మరింత పెంచుతుంది తద్వారా డయాబెటిస్ వ్యాధి నియంత్రణ కోల్పోతుంది. కావున ప్రతిరోజు బెల్లం టీ ని సేవిస్తే బెల్లంలో అత్యల్ప క్యాలరీలు లభించడంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కావున గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ప్రతిరోజు బెల్లం టీ ని సేవించడం వల్ల మన శరీరానికి అవసరమైన కాల్షియం,ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా లభించి రక్తహీనత సమస్య తొలగిపోతుంది. మరియు ఎముకలు కండరాలు దృఢంగా తయారై కీళ్ల నొప్పుల సమస్యకు చెక్కు పెట్టవచ్చు.పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. బెల్లంలో అత్యధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలైనా మలబద్ధకం ,గ్యాస్ట్రిక్ ,అజీర్తి వంటి సమస్యలను తొలగించి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.