మన దేశంలో సమృద్ధిగా పెరిగే వేప మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు మన సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అంటే చాలా మంది నమ్మకపోవచ్చు.ఈ నిజాన్ని గుర్తించిన మన పూర్వీకులు వేప చెట్టులోని ఆకులు, బెరడు, గింజల్లోనీ సహజ ఔషధ గుణాలతో ఎన్నో మొండి వ్యాధులను నయం చేసుకునేవారు అందుకే వేప మొక్కను దైవంతో సమానంగా పూజించే సంస్కృతి మొదలైందని చెప్పవచ్చు. సైన్స్ పరంగా చెప్పాలంటే దేవతగా ఆరాధించే వేప చెట్టు ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు, సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరంలోని వ్యాధి కారకాలను నియంత్రించి అనేక ఇన్ఫెక్షన్లు అలర్జీరా నుంచి మనల్ని రక్షిస్తుంది.
ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వేప ఆకుల కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని మరీ ఎక్కువ సేవిస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు వేపాకు కషాయాన్ని ప్రతి రోజు సేవించడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. వేప కొమ్మతో పళ్లను శుభ్రం చేసుకుంటే వేపలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోట్లో ఉన్న ప్రమాదకర బ్యాక్టీరియాను తొలగించి దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటిపూత, దుర్వాసన సమస్యలను అదుపులో ఉంచి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మూత్రపిండాల్లో రాళ్ల, ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడే వారువేప ఆకులను ఆరబెట్టి వాటిని బూడిదగా మార్చి ప్రతిరోజూ గోరు వెచ్చని నీటితో కలిపి రెండు మూడు గ్రాములు సేవిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ తొలగించడంతోపాటు మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది. చర్మ సమస్యలైన గజ్జి, తామర, చర్మం పొడిబారడం,దురదలు, చర్మ క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ వేప ఆకులు, పసుపు కలిపి మెత్తగా నూరి చర్మంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు సమస్యతో బాధపడేవారు వేప కషాయాన్ని తలపై మర్దన చేసుకుంటే తలలో ఉన్న ఇన్ఫెక్షన్లు తొలగిపోయి చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.