మనలో ఈ సంకేతాలు కనిపిస్తే… కాలేయం దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉన్నట్లే!

ఈ రోజుల్లో లివర్ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని వైద్య సంస్థలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రోజువారి ఆహారపు అలవాట్లు, మద్యపానం, డ్రగ్స్ సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలను ప్రధానంగా చెప్పొచ్చు. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలోనూ శరీరం నుంచి హానికర విషపదార్థాలను తొలగించడంలో కాలేయం సహాయపడుతుంది. కాలేయం పనితీరు దెబ్బతిన్నప్పుడు చిన్నచిన్న వ్యాధి లక్షణాలు మనలో కనిపిస్తాయి. వాటిని సరైన సమయంలో గుర్తించకపోతే భవిష్యత్తులో లివర్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

కాలేయం పనితీరులో వ్యత్యాసం ఏర్పడితే మనకు ముందస్తు జాగ్రత్తగా కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ చెడిపోతే కడుపులో విపరీతమైన నొప్పి, కడుపు వాపు వంటి సమస్యలు ఎక్కువ రోజులు మనల్ని వేధిస్తాయి, లివర్ సమస్య తలెత్తినప్పుడు కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారుతాయి, చర్మం నిర్జీవంలో కనిపిస్తూ అనేక చర్మ సమస్యలు తలెత్తవచ్చు. కాలేయం పనితీరు దెబ్బతింటే పచ్చకామెర్ల సమస్య తలెత్తి గోర్లు, కళ్ళు ,చర్మం పసుపు రంగులు కనిపిస్తాయి. ఒక్కోసారి ప్రాణాపాయస్థితి కూడా ఏర్పడవచ్చు.

కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు పేరుకుపోయి చర్మంపై ఎర్రటి దద్దులు, మచ్చలు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. అధికంగా నీరు తాగినప్పటికీ దాహం తీరకపోవడం గొంతు ఆరిపోవడం పెదాలు ఆరిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మూత్రశయ ఇన్ఫెక్షన్ తలెత్తి మూత్రం ముదురు గోధుమ రంగులో రావడం, కాళ్లు చేతులు హఠాత్తుగా వాపులు రావడం, రక్త ప్రసరణ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే ఆకలి లేకపోవడం, జీర్ణశక్తి మందగించడం వంటి సమస్యలు తలెత్తి అలసట నీరసం చికాకు వంటి లక్షణాలు ఎక్కువ రోజులు వేధిస్తుంటే పైన సూచించిన ఏ లక్షణమైన ఎక్కువ రోజులు మిమ్మల్ని కలవరపెడుతుంటే తక్షణమే వైద్య సలహాలు తీసుకోవాలి లేకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చు.