ఈ దుంప జ్యూస్ ను ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే మన శరీరంలో జరిగే అద్భుతాలెన్నో?

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బీట్‌రూట్‌ను తరచూ మన ఆహారంలో తీసుకోవడంతో పాటు ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారానికి ముందే బీట్ రూట్ జ్యూస్ ను సేవిస్తే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్సు, విటమిన్స్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. బీట్ రూట్ జ్యూస్ ప్రతిరోజు సేవిస్తే శరీర దృఢత్వం పెరగడంతోపాటు మనలో నీరసన్ని తొలగించి రోజంతా ఉత్తేజంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బీట్‌రూట్‌ జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తాజా బీట్రూట్ దుంపలను సేకరించి పై పొట్టును తొలగించుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ ముక్కలను మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేసుకోవాలి. బీట్రూట్ రసంలో రుచి కోసం తేనె, నిమ్మరసం, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఎక్కువమంది చక్కెరను వేస్తుంటారు ఇది అంత మంచిది కాదు. బీట్రూట్లో కూడా అధికంగా చక్కెర నిల్వలు ఉంటాయి దానికి తోడు మనం చెక్కరను ఎక్కువగా ఉపయోగిస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరిగి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుంది.

బీట్‌రూట్‌లో నైట్రేట్‌ నిల్వలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేసి రక్తనాళాలను శుద్ధి చేస్తుంది దాంతో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఎముకలు కండరాల దృఢత్వాన్ని పెంచే కాల్షియం వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా మూలకం బీట్రూట్లో సమృద్ధిగా ఉంటుంది. దీన్ని ఆహారంగా తీసుకుంటే కండరాల, నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే తలసేమియా,రక్తహీనత సమస్య ను దూరం పెట్టవచ్చు. అలాగే కంటి ఆరోగ్యాన్ని చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.