కొవ్వు పదార్థాలను తినడానికి సంకోచిస్తున్నారా? ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి..!

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ తో పాటు కొవ్వు పదార్థాలు కూడా పుష్కలంగా ఉండాలని అనేక సర్వేల్లో వెళ్లడైంది అయితే చాలామంది బరువు పెరుగుతారని, గుండె జబ్బులు వస్తాయని, రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తుతాయని కొవ్వు పదార్థాలను ఆహారంలో తీసుకోవడానికి సంకోచిస్తుంటారు.ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో మనకు అవసరమైన క్యాలరీలు దాదాపుగా 20 శాతం కొవ్వు పదార్థాల నుంచి లభిస్తాయి. కావున మనం తీసుకునే ఆహారంలో కొవ్వు ఆమ్లాలు కచ్చితంగా ఉండాల్సిందే.

అయితే కొవ్వు పదార్థాలను తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త పాటించాలి.కొవ్వులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.ఇందులో మంచి కొవ్వులు, చెడు కొవ్వులు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే డైరీ ప్రొడక్ట్స్, పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్ ప్రాసెస్ చేయబడ్డ ఆహారాల్లో హానికరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని అత్యధికంగా మన ఆహారంలో తీసుకుంటే వీటిలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఉబకాయ సమస్యకు దారితీసి అతి బరువు, గుండె జబ్బులు,రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తి దీర్ఘకాలం పాటు అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

మన శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు సహజమైన ఆహార పదార్థాల్లో లభిస్తాయి. వీటిలో పాలీ, మోనో శాచ్యురేటెడ్ కొవ్వులు అంటారు. ఇలాంటి మంచి కొవ్వు పదార్థాలు ఎక్కువగా పప్పు ధాన్యాలు,
సహజంగా లభించే ఆకుకూరలు,గుడ్లు, చేపలు, కొబ్బరి, సోయా, అవకాడో ,ఫిష్ ఆయిల్స్,వాల్‌నట్స్ వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మన
నిత్య జీవక్రియలకు అవసరమైన ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి.మంచి కొవ్వులు జీవక్రియను పెంచుతాయి. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడానికి ఆకలిని తగ్గిస్తాయి.శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉండేందుకు మంచి కొవ్వులు ఎంతగానో తోడ్పడుతాయి.అలాగే కొవ్వులో కరిగే ఏ, డి, ఈ, కే వంటి విటమిన్స్ మన శరీరం సమృద్ధిగా గ్రహిస్తుంది. తద్వారా మన శరీరానికి అవసరమైన సంపూర్ణ శక్తి లభ్యమవుతుంది కండరాలు ఎముకలు దృఢంగా తయారవ్వడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తి కూడా అధికమవుతుంది.