నేటి యువతరం ఎదుర్కొనే సమస్యల్లో బట్టతల సమస్య ప్రధానమైనది గానే చూపొచ్చు. మారుతున్న జీవనశైలి, క్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, జన్యు పరమైన కారణాలు,
అధిక పని ఒత్తిడి, ఆర్థికపరమైన కారణాలు ఇలా చెప్పుకుంటూ పోతే బట్టతల సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. కారణాలు ఏవైనా సరే చిన్న వయస్సులోని బట్టతల సమస్య తలెత్తితే మానసిక వేదనతో నలుగురిలో స్వేచ్ఛగా తిరగలేక చదువు, కెరియర్, వృత్తిపరమైన బాధ్యతల్లో వెనకబడి పోతుంటారు కొందరు.
సాధారణంగా మన తలలో కొన్ని వెంట్రుకలు రాలిపోతూ అవే పరిమాణంలో కొత్తవి వస్తూ ఉంటాయి. అలాకాకుండా ఎక్కువ మొత్తంలో జుట్టు రాలిపోతే బట్టతల సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే వెంట్రుకల ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మొదట మీరు ప్రతిరోజు తినే ఆహారంలో వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు గుడ్లు చేపలను ఎక్కువగా తినాలి. ఫాస్ట్ ఫుడ్ ,సాఫ్ట్ డ్రింక్ జోలికి అసలు వెళ్ళకూడదు.
గుడ్డులో వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడే కెరోటిన్, కొల్లాజన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కావున అప్పుడప్పుడు గుడ్లలో రెండు టేబుల్ స్పూన్ల పెరును మిక్స్ చేసి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత మీరు ప్రతిరోజు వాడే షాంపుతో తలస్నానం చేస్తే
మీజుట్టును సిల్కీగా,అందంగా మారి ఒత్తుగా , దృఢంగా పెరుగుతుంది. అలాగే తలస్నానం చేసే 15 నిమిషాల ముందు ఉల్లి రసాన్ని జుట్టు కుదురులకు అంటే విధంగా మర్దన చేసుకుని తల స్నానం చేస్తే చుండ్రు తగ్గి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఉసరిని ఆహారంగా తీసుకోవడంతో పాటు ఊసరసాన్ని వారంలో రెండు లేదా మూడు సార్లు తలకుదురులకు అంటే విధంగా మర్దన చేసుకుంటే ఉసరిలో ఉండే విటమిన్ సి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ హెయిర్ ఫోలికల్స్ ను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.