పసుపు దంతాల సమస్యతో బాధ పడుతున్నారా.. సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే!

ప్రతి పది మందిలో నలుగురు పసుపు దంతాల సమస్యతో బాధ పడుతుంటారు. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పసుపు దంతాల సమస్యకు నిమ్మరసంతో సులువుగా చెక్ పెట్టవచ్చు. నిమ్మరసం వాడటం వల్ల దంతాలు మిలమిలా మెరిసే అవకాశాలు అయితే ఉంటాయి.

గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి ఉదయం, సాయంత్రం బ్రష్ చేయడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. నిమ్మరస్ం ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుంది. దంతాలపై యాపిల్ సైడర్ వెనిగర్ రాయడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఉప్పు, ఆవాల నూనె కలిపి తీసుకుని దంతాలు శుభ్రం చేసుకుంటే పసుపు దంతాల సమస్య దూరమవుతుంది.

ఈ చిట్కాలు పాటించినా పళ్లు శుభ్రం కాకపోతే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవడం ద్వారా ఈ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు. సాల్ట్ వాటర్ రిన్స్ చేయడం ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా కూడా దంత సంబంధిత సమస్యలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పసుపులో బేకింగ్ సోడా కలిపి పళ్లు తోముకుంటే కూడా పళ్లు మిలమిలా మెరుస్తాయి.

బేకింగ్ సోడాను ఉపయోగించడం ద్వారా కూడా పళ్లు తెల్లగా మెరిసే అవకాశం అయితే ఉంటుంది. పళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పళ్ల విషయంలో వైద్యుల సలహాలను, సూచనలను పాటిస్తే పళ్లు సులువుగా మిలమిలా మెరుస్తాయి.