ప్రసుత కాలంలో చాలామంది చిన్న వయస్సులోనే కంటిచూపు మందగించడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కంటిచూపు మందగించడం వల్ల చేయాల్సిన పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు చెబుతుంటారు.
మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిని కంటి సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కంటి సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు బాదం పప్పులను నీటిలో నానబెట్టి ప్రతిరోజూ తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది.
ఉసిరికాయలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభించే అవకాశం ఉంటుంది. నీటిలో ఉసిరికాయ జ్యూస్ కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పచ్చని ఆకుకూరలు, కూరగాయలు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి సంబంధిత సమస్యలు దూరమై కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బొప్పాయి, నారింజ, ద్రాక్ష, దానిమ్మ తీసుకోవడం ద్వారా కంటి సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ చిట్కాలు పాటించినా సమస్య తగ్గని పక్షంలో వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడాల్సి ఉంటుంది.