Gallery

Home Health & Fitness Chilli: రోజుకో పచ్చిమిర్చి అయినా తినాలి..! లాభాలు అలాంటివి..!!

Chilli: రోజుకో పచ్చిమిర్చి అయినా తినాలి..! లాభాలు అలాంటివి..!!

Chilli: పచ్చిమిర్చి ఘాటెంతో మనకు తెలిసిందే. అలానే.. పచ్చిమిర్చి లేకపోతే కూరలెలా చేస్తాం. పచ్చిమిర్చితోనే రుచి వచ్చే వంటకాలూ ఉన్నాయి. కూరల్లో పచ్చిమిర్చి కనిపిస్తే వదలకుండా తినేవారూ ఉన్నారు. ఘాటు అంటే ఇష్టమైన వారు మాత్రమే చేసే పని ఇది. అయితే.. పచ్చిమిర్చి కారం, ఘాటు మిక్స్ అయి ఉన్నా మనకు చాలా మేలు చేస్తుంది. ఇందులో కొన్ని విటమిన్లు కూడా ఉన్నాయి. శరీరానికి కావల్సిన శక్తిని ఇస్తాయి. ఎలా అంటే..

Green Chilli Health Benefit 1 | Telugu Rajyam

పచ్చిమిర్చి కారంగా ఉంటుంది కదా అని.. ఎటువంటి పోషకాలు ఉండవనుకుంటే పొరపాటే. దాన్లో విటమిన్ C కూడా ఉంటుంది. రోజూ ఓ పచ్చి మిరప.. కూరల్లో వండినవైనా సరే తింటే బాడీకి కావాల్సిన విటమిన్ C దక్కుతుందని నిపుణులు అంటున్నారు. జ్వరం, దగ్గు, జలుబు తీవ్రత తగ్గాలంటే పచ్చి మిర్చి తినాలని కూడా అంటున్నారు. పచ్చిమిర్చిలో ప్రొస్టేట్ కాన్సర్‌ ను తగ్గించే గుణాలున్నాయి. మిర్చిని వంటల్లో సన్నగా తరిగి వేసుకుని కూరల్లో పారేయకుండా తింటే దాన్లోని గుణాలు శరీరానికి అందుతాయి.

పచ్చిమిర్చి మన జీర్ణక్రియను కూడా సమర్ధవంతంగా పనిచేయిస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేయడంలో బాగా పని చేస్తుంది. చిల్లీ సాస్ వేసుకుని తినడం ద్వారా కూడా ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయి. పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి అనేక రకాల వైరస్, చెడు బ్యాక్టీరియాను తరిమికొట్టేలా పని చేస్తాయి. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. కాంతి వంతంగా ఉంచుతుంది.

రోజుకు ఒక్క పచ్చిమిర్చైనా తింటే పలు రకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చని ఆహార నిపుణులు అంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం నుంచి వేగంగా విముక్తికి పచ్చిమిర్చి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. పచ్చిమిర్చి అంటే.. కారం అనే భావనలోనే ఉంటాం కానీ.. ఇలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పచ్చిమిర్చిలో కూడా ప్రాంతాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, విత్తనాల్ని బట్టి పండుతూంటాయి. అయినా.. వాటిలోని పోషక విలువలు మాత్రం మారవు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

- Advertisement -

Related Posts

‘మైగ్రేన్’ విముక్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

మైగ్రేన్... తల పగిలిపోతుందా అన్నట్లుగా, నరాలు చిట్లిపోతున్నాయా అనేంతలా భాదించే తలనొప్పి. సాధారణంగా వచ్చే తల నొప్పికి ఒక కప్పు టీ లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తరుచుగా...

ఆరోగ్యానికి అమృతం… ‘డ్రాగ‌న్ ఫ్రూట్’ ! ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ కారణంగా ప్రజలలో ఈ మధ్య ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మీద అవగాహన పెరిగి ఫ్రూట్స్ వాడకం చాలా ఎక్కువైంది. ఈ క్రమంలోనే 'డ్రాగ‌న్ ఫ్రూట్' ప్రాధాన్యత వాణిజ్యపరంగా బాగా పెరిగింది....

లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఉదయాన్నే వీటిని ట్రై చేయండి !

ఒక మంచి వేకువ జాము దినచర్య అనేది ఎంతో మంది విజయ రహస్యంగా భావించవచ్చు. కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన లక్ష్యాలను చేధించే ప్రక్రియకు శక్తినిస్తాయి. జీవితంలో ఏదో సాధించాలని అనుకునే...

Latest News