మనలో చాలామంది షుగర్ ఉన్న వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ వంటకాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అయితే తెల్లగా కనిపించే షుగర్ తో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల ప్రాణాలకు అపాయం కలుగుతుంది. చక్కెర ఒక రకమైన పిండి పదార్థం కాగా వంటకాలలో చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగిస్తే మంచిదని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నరు.
ఎవరైతే షుగర్ తో చేసిన వంటకాలు, కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తీసుకుంటారో వాళ్లకు దీర్ఘకాలంలో మధుమేహం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మనం ప్రతిరోజూ తీసుకునే అనేక వంటకాలు, పండ్లలో షుగర్ ఉంటుంది. ఆ షుగర్ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కాగా సాధారణంగా షుగర్ తో చేసిన వంటకాలు శరీరానికి హాని కలిగించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి.
ఎవరైతే చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటారో వాళ్లు తక్కువ సమయంలో బరువు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. చక్కెరతో తయారు చేసిన పదార్థాలు తినడానికి రుచిగా ఉన్నా దంత సమస్యలకు కారణమవుతాయి. గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటుతో బాధ పడేవాళ్లు చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుంటే ఆ రిస్క్ మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
షుగర్ ఎక్కువగా తీసుకునే వాళ్లను కాలేయ సంబంధిత వ్యాధులు సైతం వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కాలేయ సంబంధిత సమస్యలు వస్తే ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది. షుగర్ వల్ల శరీరానికి కలిగే లాభాలతో పోల్చి చూస్తే నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.