ఉసిరికాయను ఎక్కువగా తింటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయా…. వైద్యులు ఏమంటున్నారో తెలుసా?

మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఉసిరికాయ కీలక పాత్ర పోషిస్తుంది. కారణం ఉసిరికాయలు సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఏ, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా లభించడమే అందుకే వ్యాధి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం ఉండే చలికాలం లాంటి సీజన్లలో తగు మోతాదులు ఉసిరికాయను ఆహారంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.

శీతాకాలంలో ఉసిరికాయను తరచూ మన ఆహారంలో భాగం చేసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ మైక్రోబియల్ గుణాలు, విటమిన్ సి సీజనల్గా వచ్చే ఫ్లూ, దగ్గు , జ్వరం, గొంతు నొప్పి, వంటి అలర్జీలను అదుపు చేయడంలో సహాయపడుతుంది. అలాగని ఒక్కరోజులో మరీ ఎక్కువ ఉసిరికాయలను తింటే జలుబు, దగ్గు సమస్య మరి తీవ్రమవుతుంది కారణం ఉసిరికాయలో మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది అందుకే ఉసిరికాయను ఎక్కువగా తినకూడదు అంటుంటారు.వాతావరణ మార్పుల కారణంగా కొందరిలో వచ్చే చర్మ అలర్జీలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా మృదువుగా ఉంచడంలో సహాయపడడమే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్న ఉసిరికాయను కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా తింటే సమస్య మరి తీవ్రమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు దీనికి గల కారణం ఉసిరికాయల్లో అధికంగా ఉన్న సోడియం నిలువలు కిడ్నీలో రాళ్ల సమస్యకు కారణం కావచ్చు అందుకే కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడ్డారు ఉసిరికాయకు దూరంగా ఉండాలి. కొందరిలో తరచూ తలిస్తే కడుపులో మంట, ఒత్తి కడుపు వాపు వంటి సమస్యలు ఉన్నవారు ఉసిరికాయను ఆహారంగా తీసుకుంటే మరింత నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున వీటికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు వీటిని ఎక్కువగా తినరాదు ఎందుకంటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పడిపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు…