ప్రకృతి సిద్ధంగా ఎలాంటి రసాయనాలు వాడకుండా పండే సొరకాయను తెలంగాణలో ఆనిగపుకాయ అని
కొన్ని ప్రాంతాల్లో అనపకాయ అని కూడా పిలుస్తారు.అత్యధిక పోషక విలువలు కలిగి ఉన్న తీగజాతి కాయగూరల్లో సొరకాయకు ప్రత్యేక స్థానం ఉంది.సొరకాయలో దాదాపు 96% శాతం కలిగి ఉండి అధిక భాగం ఫైబర్ తో నిండి ఉంటుంది. ప్రతిరోజు మన జీవక్రియలకు అవసరమైన విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె , రైబోఫ్లెవిన్, జింక్, థయామిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. సొరకాయను కూరగానే కాకుండా సొరకాయ హల్వా, వడియాలు, జ్యూస్ ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు,
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు సొరకాయను తినడం వల్ల సొరకాయలో ఉన్న ఔషధ గుణాలు క్లోమం పనితీరును మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది .అలాగే ఇందులో ఉండే పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.ఒక కప్పు సొరకాయ జ్యూస్ లో 26 మిల్లీ గ్రాముల విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది కావున ప్రతిరోజు ఉదయాన్నే సొరకాయ జ్యూస్ సేవిస్తే మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి రోజంతా మనల్ని ఉల్లాసంగా ఉంచుతుంది.
సొరకాయ జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం, ఉబ్బసం గ్యాస్టిక్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నియంత్రించవచ్చు. సొరకాయలు యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్ప్లిమెంటరీ గుణాలు పుష్కలంగా ఉండడం వలన మన శరీరంలోని వ్యాధికారక కణాలను నశింపజేసి అనేక ఇన్ఫెక్షన్లు , క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
సొరకాయ జ్యూస్ లో నిమ్మరసం, తేనె పరగడుపున సేవిస్తే కిడ్నీ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు వంటి అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
సొరకాయ జ్యూస్ లో తగిన అల్లం రసాన్ని కలుపుకొని సేవిస్తే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది దాంతో రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులను అదుపు చేయవచ్చు. వేసవికాలంలో సొరకాయ జ్యూస్ ను క్రమం తప్పకుండా సేవిస్తే ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడతాయి