ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపాలను సవరించాలంటే ప్రతి రోజు ఈ జ్యూస్ తాగాల్సిందే!

వేసవి సీజన్ లో మాత్రమే అధికంగా లభించే కర్బూజా పండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కె,బీటాకెరోటిన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, పోలేట్, పొటాషియం వంటి ఎన్నో సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి కావున వేసవిలో ఎండ తీవ్రత వల్ల కోల్పోయిన నీటి శాతాన్ని, ఖనిజ లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కర్బూజా పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. మరియు రక్త పోటు, అలసట నీరసం, కిడ్నీ ఇన్ఫెక్షన్లు మరియు మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో తోడ్పడతాయి.

ప్రతిరోజు కర్బూజా పండు లేదా జ్యూస్ ను సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కర్బూజా పండులో సమృద్ధిగా లభించే విటమిన్ సి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, పోలేట్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తంలో ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. మరియు ప్రతిరోజు ఉదయాన్నే కర్బూజ జ్యూస్ తాగడం వలన నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ చురుగ్గా మారి మెదడుకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో అడ్డంకులను తొలగిస్తాయి తద్వారా మానసిక ఒత్తిడి, అలసట వంటి లక్షణాలు తొలగి నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కర్బూజా పండును జ్యూస్ రూపంలో సేవిస్తే వీటిల్లో ఉండే ఔషధ గుణాల కారణంగా కిడ్నీలో రాళ్ల సమస్య తొలగిపోతుంది.మరియు జీర్ణశక్తి మెరుగుపడి పేగుల్లోని చెడు మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కర్బూజా పండులో అధికంగా ఉండే పోలేట్, పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి హార్ట్ ప్రాబ్లమ్స్ ను నివారిస్తుంది.కర్బూజలో బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను సరిచేస్తాయి.

కొన్ని అధ్యయనాల ప్రకారం కర్బూజా పండు సెక్స్ సంబంధిత సమస్యలను తొలగించి ప్రత్యుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కర్బూజా పండు లో ఉన్న సహజ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మం అలర్జీలను తగ్గించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.