మీ పిల్లలు తరచూ చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? ఇవే కారణాలు కావచ్చు!

సాధారణంగా చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా మృదువుగా ఉంటుంది వారి విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించిన పెద్ద ఎత్తున చర్మ సంబంధిత సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఇలా చర్మ సమస్యలు కనుకచిన్నపిల్లలలో తరచూ ఉన్నట్లయితే అందుకు గల కారణాలను ముందుగా ఆలోచించాలి ఇలా చిన్న పిల్లలలో తరచూ చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నాయి అంటే ఇవే ప్రధాన కారణాలు కూడా కావచ్చు.

ముఖ్యంగా చిన్నపిల్లల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దులు వచ్చి దురద సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. కొందరిలో దురద సమస్య మరి ఎక్కువగా ఉండటం వల్ల గోళ్లతో గోకడం వల్ల గాయమై రక్తస్రావం కూడా కలుగుతుంది. శీతాకాలం సీజన్లో పిల్లల్లో ఎక్కువగా వచ్చే ఇలాంటి చర్మ సమస్యను ఎగ్జిమా అని పిలుస్తారు. ఈ సమస్య 100 మంది పిల్లల్లో దాదాపు పది మందికి ఈ సమస్య వేధిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యపై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన చర్మ సమస్యగా మారే ప్రమాదం ఉంది.

పిల్లల్లో పోషకాహార లోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. ఎగ్జిమా చర్మ సమస్యకు ప్రధాన కారణం చర్మం పై పొరల్లో పిలాగ్రీన్ అనే ప్రోటీన్ లోపించడమే ఈ చర్మ సమస్యకు ప్రధాన కారణమని చెబుతున్నారు చర్మంలో ఈ ప్రోటీన్ లోపిస్తే త్వరగా తేమను కోల్పోయి పొడి చర్మం గా మారుతుంది దానికి తోడు వాతావరణ మార్పులు కారణంగా తీవ్ర సమస్యగా తలెత్తి పిల్లలకు కాళ్లు, చేతివేళ్లు,భుజాలు, ముఖం, నడుము భాగం తదితర భాగాల్లో చర్మం పొడిబారి తీవ్రమైన దురద వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు చర్మం ఇలా కాకుండా ఉండాలి అంటే ఎక్కువగా వారికి అధిక గాడత కలిగిన సోపులతో స్నానాలు చేయించకూడదు వారి శరీరం ఎప్పుడు తేమగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని మాయిశ్చరైజ్ రాయాల్సి ఉంటుంది..అలాగే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి ఇలా జాగ్రత్తలు తీసుకొని తగ్గనప్పటికీ డాక్టర్ను సంప్రదించడం మంచిది.