సాధారణంగా చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ శక్తి చాలా తక్కువగా ఉంటుంది కావున తొందరగా వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురై తరచూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా జలుబు, దగ్గు వంటి ఫ్లూ లక్షణాలతో పాటు కంటి అలర్జీలు కూడా తలెత్తి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. దానికి తోడు ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్స్ ముందే గడుపుతున్నారు ఫలితంగా మొబైల్ స్క్రీన్ నుంచి వెలువడే ప్రమాదకర కాంతి కిరణాల రేడియేషన్ ప్రభావం పిల్లల కళ్ళ పై తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది. ఫలితంగా చిన్న వయస్సులోనే కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
చిన్నపిల్లల తల్లిదండ్రులు పిల్లల కంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే భవిష్యత్తు అంధకారంగా అయ్యే ప్రమాదం ఉంటుంది. చిన్నపిల్లలను తరచూ వేధించే బ్యాక్టీరియల్ ,వైరల్ ఇన్ఫెక్షన్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే వ్యాధినిరోధక శక్తినీ పెంపొందించే విటమిన్ సి సమృద్ధిగా కలిగిన పండ్లు, కూరగాయలను ఆకుకూరలను రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఉండునట్లు చూసుకోవాలి.పిల్లలు తమ రోజువారి ఆహారంలో క్యారెట్ ను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది.
పిల్లల్లో మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి అత్యధిక ప్రోటీన్స్ కలిగిన గుడ్లు, చేపలు, బీన్స్, పెరుగు, వెన్న ,నెయ్యి చిరుధాన్యాలు రోజువారి డైట్ లో కచ్చితంగా తీసుకోవాలి.
గుమ్మడి గింజల్లో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది కావున పిల్లలకు స్నాక్స్ రూపంలో ఉదయం సాయంత్రం కాసిన్ని గుమ్మడి గింజలను తినిపించడం మంచిది. ప్రతిరోజు నానబెట్టిన బాదం గింజలను ఆహారంగా ఇస్తే వీటిల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.