మీ పిల్లలు చురుగ్గా లేకుండా మూడీగా కనిపిస్తున్నారా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా కొంతమంది పిల్లలు కొన్ని విధాలుగా వారి ప్రవర్తన శైలి ఉంటుంది. కొందరు ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ చాలా చలాకీగా కనిపిస్తారు మరికొందరి మాత్రం ఎలాంటి యాక్టివిటీస్ లో పాల్గొనకుండా వెనకడుగు వేస్తూ చాలా మూడీగా కనిపిస్తూ ఉంటారు. ఇలా మీ పిల్లలు కనక చురుగ్గా లేకుండా నిత్యం మూడీగా కనిపిస్తూ కనుక ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ డ్రింక్ తాపించడం మొదలు పెట్టండి ఇలా ఈ డ్రింక్ తాపించడం వల్ల పిల్లలు మెదుడు పనితీరు ఎంతో చురుగ్గా ఉండడమే కాకుండా పిల్లలలో కూడా చలాకితనం వస్తుంది.

మరి ఏ విధమైనటువంటి డ్రింక్ తాపించాలి వాటిని ఎలా తయారు చేయాలనే విషయానికొస్తే ముందుగా ఒక ఐదు బాదం పప్పు, 10 జీడిపప్పు, 10 ఎండిన ద్రాక్షను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.స్టవ్ పై ఒక గ్లాస్ ఆవు పాలు వేసి ఆవు పాలు మరిగిన తర్వాత రెండు కుంకుమ పువ్వు రేకులు వేయాలి. ఇలా పాలు ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పిస్తా బాదం వంటి వాటిని వేసి మరొక ఐదు నిమిషాలు తక్కువ మంటపై మరిగించాలి.ఇక చివరికి కొద్దిగా తాటి బెల్లం వేసి మరొక నిమిషం పాటు మరిగించి గోరువెచ్చగా ఉన్న సమయంలో పిల్లల చేత ఉదయం లేదా సాయంత్రం తాగించాలి.

ఈ విధంగా ప్రతిరోజు ఈ డ్రింక్ తాగించడం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషకాలు పిల్లల పనితీరును చురుగ్గా ఉంచడానికి దోహదపడతాయి. అదేవిధంగా పిల్లల్లో రోగ నిరోధక శక్తి కూడా పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.ముఖ్యంగా ప్రతిరోజు ఇలా తాపించడం వల్ల ఈ డ్రింక్ ప్రభావం మెదుడు పనితీరుపై పడుతుంది. దీంతో పిల్లలు మూడిగా కాకుండా ఎంతో చలాకీగా ఉంటారు.