పెరుగును ఈ విధంగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా? వైద్యులు ఏమంటున్నారంటే?

ఈ రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలతో పాటు షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశమే, అయినప్పటికీ షుగర్ వ్యాధి తీవ్రత మాత్రం అదుపులోకి రావట్లేదు. అసలు షుగర్ వ్యాధికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జన్యుపరమైన కారణాలు, సరైన ఆహారం నియమాలు పాటించకపోవడం, నిద్రలేమి సమస్యలు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలవల్ల శరీర బరువు పెరిగి ఉభకాయ సమస్య ఏర్పడుతుంది. తద్వారా షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.

షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే జీవితకాలం పాటు మందులు వాడుతూ బాధపడాల్సిందే. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే కంటి చూపు తగ్గడం, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత, గుండె జబ్బులు, దంతాలు ఊడిపోవడం, లైంగిక శక్తి తగ్గడం, మెదడు సంబంధిత వ్యాధులను రాకుండా ఉంచుకోవాలంటే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం తక్షణ కర్తవ్యం.

షుగర్ వ్యాధిని అదుపులో ఉంచాలంటే మన ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి. మొదట కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పాలిష్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం తగ్గించి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలి.సమయానికి ఆహారం తినాలి అయితే అతిగా తినకూడదు. పిజ్జా ,బర్గర్ ,సాఫ్ట్ డ్రింక్ వంటి జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళకండి. పెరుగు ఆరోగ్యానికి మంచిది అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల పెరుగులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండి ఉబకాయానికి దారి తీయవచ్చు ఉబకాయం వల్ల షుగర్ తీవ్రత పెరుగుతుంది. కావున ఫ్యాట్ కంటెంట్ లేని మజ్జిగ తాగడం ఉత్తమం.

మన ఆహారపు అలవాట్లతో పాటు ప్రతిరోజు జీవన విధానంలో కూడా సమూలమైన మార్పులు చేసుకోవాలి. మొదట ఉదయం ,సాయంత్రం తప్పనిసరిగా వ్యాయామం, కొంత శారీరక శ్రమ కలిగిన
నడక వంటివి దినచర్యగా అలవాటు చేసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగి ఉబకాయంతో పాటు
షుగర్ వ్యాధితో నీ అదుపులో ఉంచవచ్చు. ప్రతిరోజు 8 గంటల నిద్రని కచ్చితంగా పాటించాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇలా సరైన నియమాలు పాటిస్తూ తరచూ వైద్యుల్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకొని మందులు వాడినట్లయితే షుగర్ ని అదుపులో ఉంచుకోవచ్చు.