ప్రతిరోజు ఒక కోడిగుడ్డును ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ పోషకాలను పొందవచ్చునని మనందరికీ తెలుసు. అయితే కొందరు మాత్రం ప్రతిరోజు కోడిగుడ్లను తినడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని తద్వారా గుండె జబ్బులు, రక్తపోటు,డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడాల్సి వస్తుందని గుడ్డును తినడానికి సంకోచిస్తుంటారు. అసలు ప్రతిరోజు కోడిగుడ్డును తినొచ్చా తింటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, లేదా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వంటి విషయాల గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు మన నిత్య జీవక్రియలకు అవసరమైన ప్రోటీన్స్,విటమిన్స్,మినరల్స్ సమృద్ధిగా లభించాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు ఒక గుడ్డును తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు గుడ్లను తినడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పెరుగుతాయి అనడంలో ఎటువంటి ఆధారాలు లేవు కేవలం ఇది అపోహ మాత్రమే. ప్రతిరోజు గుడ్లను తినడం వల్ల మన శారీరక ,మానసిక పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే గుడ్లలో ఉన్న అమైనో ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తొలగించడంలో కూడా సహాయపడతాయని అనేక సర్వేలో వెల్లడైంది. అయితే గుడ్లను అధిక మొత్తంలో తీసుకోవడం ప్రమాదకరమే. కాబట్టి ప్రతిరోజు ఒకటి లేదా రెండు గుడ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్డు తినడం మరీ మంచిది.
ప్రతిరోజు ఒక గుడ్డును తినడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ బి12, కాల్షియం ఐరన్ పోలిక్, ఫాస్పరస్ జింకు వంటి పోషకాలు సమృద్ధిగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రతిరోజు ఒక గుడ్డును తినడం వల్ల నాడీ కణాభివృద్ధి సక్రమంగా జరిగి పిల్లలు మానసిక పరిపక్వత చెందుతారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇతర ఆహార పదార్థాల్లో లభించే ప్రోటీన్లు, కొవ్వులు కంటే గుడ్డులో లభించే ప్రోటీన్లు కొవ్వులు అత్యంత నాణ్యమైనవిగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజు గుడ్డును ఆహారంగా తీసుకునే వారిని పరిశీలించినప్పుడు వీరిలో అత్యధికంగా మంచి కొవ్వు పదార్థాలు వృద్ధి చెందినట్లు పరిశోధనాల్లో తెలిసింది.