బీరకాయను తరచూ మన ఆహారంలో ఎందుకు తీసుకోవాలో తెలుసా?

తీగ జాతి కాయగూరల్లో ఒకటైన బీరకాయను ప్రతిరోజు మన ఆహారంలో తీసుకోవడం వల్ల సకల ఆరోగ్య ప్రయోజనాలను సహజ పద్ధతిలో పొందవచ్చునని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బీరకాయలో అత్యధికంగా పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్ , థయామిన్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా బీరలో నీటి శాతం, మరియు ఫైబర్ ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ సులువుగా కరిగించడంలో సహాయపడుతుంది. బీరకాయతో అనేక రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు తరచూ బీరకాయను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

బీరకాయలో సమృద్ధిగా పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి12 వంటి అనేక సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఐరన్ మూలకం మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను ఉత్తేజపరిచి శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో సహాయపడుతుంది దాంతో శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. మెగ్నీషియం నాడీ కణ వ్యవస్థను బలోపేతం చేసి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

బీరకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు , పెప్టైడ్స్‌, ఆల్క్‌లైడ్స్‌ పుష్కలంగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి సీజనల్ కావచ్చే అలర్జీలను, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. బీరకాయలు సమృద్ధిగా ఉన్న డెంటరి ఫైబర్ రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమపరిచి గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కావున షుగర్ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా బీరకాయను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అతి బరువు సమస్య ఏర్పడుతుంది దాన్ని అధిగమించడానికి ఫైబర్ పుష్కలంగా ఉన్న బీరకాయను ఆహారంగా తీసుకుంటే శరీరంలో చేరు కొలెస్ట్రాల్ తరిగిపోయి శరీరాన్ని సన్నగా దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీరకాయలు సహజ నీటి నిల్వలు సమృద్ధిగా ఉండి మన శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి ఇస్తాయి.