రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.. మొదటి దశలో ఎలా గుర్తించాలో తెలుసా?

మహిళలను ఎక్కువగా కలవరపరిచే అనారోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ ప్రధానమైనది గానే చెప్పొచ్చు. ప్రతి ఏడాది రొమ్ము క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో పలు ఆరోగ్య సంస్థలు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంపొందించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తే మొదటి దశలో ఈ క్యాన్సర్ ను గుర్తించినట్లయితే సులువుగా ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి తొందరగా బయటపడుచునని వైద్యులు చెబుతున్నారు.

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, రొమ్ము క్యాన్సర్ ను తొలిదశలో ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం
రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను చూసినట్లయితే
మొదట రొమ్ముల్లో గడ్డలు రావడం అనేది అతి సాధారణ లక్షణం, రొమ్ము పరిమాణంలో తేడాలు రావడం, దీర్ఘకాలం పాటు రొమ్ము నొప్పి వాపు కలిగి ఉండడం,చనుమొన లోపలికి తిరగడం,ఎరుపు, గోధుమ లేదా పసుపు రంగులో చనుమొన ఉత్సర్గం రావడం, రొమ్ము చర్మం నారింజ తొక్క ఆకారంలో అవడం, త్వరగా బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పైన తెలిపిన లక్షణాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీకు రొమ్ము క్యాన్సర్ ఉందని అర్థం కాదు ఇలాంటి లక్షణాలు దీర్ఘ కాలం పాటు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుల సలహాలు తీసుకోవాలి అప్పుడే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడగలుగుతారు
రొమ్ము క్యాన్సర్ రెండు రకాలుగా వైద్యులు వర్గీకరించారు. ఇందులో మొదటిది నాన్‌వాసివ్ క్యాన్సర్ అనేది అసలు కణజాలం నుంచి వ్యాపించని క్యాన్సర్. దీనిని దశ 0 గా సూచిస్తారు. ఇన్వాసివ్ క్యాన్సర్ అనేది చుట్టుపక్కల కణజాలాలకు వ్యాపించే క్యాన్సర్. ఈ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి ప్రతి ఒక్క మహిళ రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంపొందించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.