స్టైలిష్‌గా కనిపిస్తూనే… మాస్ పాత్రలతో అలరించే కథానాయకుడు రామ్. ఆడియెన్స్లో ఆయనకుండే క్రేజ్ వేరు. అభిమానులు, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు తన ఆహార్యాన్ని మార్చుకుంటూ, విభిన్నపాత్రలతో మెప్పిస్తారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్గా, లవర్ బాయ్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుని కెరీర్లో ముందుకెళ్తున్నారు. అయినా ఇంకా స్టార్ డమ్ను అందుకోలేకపోయారు. ఆయనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన చాలా మంది హీరోలు బిగ్ మార్కెట్ హీరోస్గా కూడా ఎదిగిపోయారు.
పాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ను పెంచుకున్నారు. కానీ రామ్ మాత్రం ఇంకా టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి హిట్ సినిమాలోత ఆయనన తన పూర్తి ఫోకస్ మాస్ కథలపై పెట్టారు. అలా ఆయన చివరిగా దర్శకుడు లింగుస్వామితో చేసిన వారియర్ సినిమా ఆకట్టుకోలేకపోయింది. భారీ డిజాస్టర్గా నిలిచింది. దీనికి ప్రేక్షకుల్ని కనెక్ట్ కాలేకపోయారు. అయినా ఆయన మళ్లీ మాస్పైనే దృష్టి పెట్టి మాస్ డైరెక్టర్ బోయపాటితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సారి ఎలాగైనా మాస్ ఆడియెన్స్ను ఆకట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నారు.
అయితే బోయపాటి అంటే కూడా భారీ యాక్షన్ కమర్షియల్ సినిమాలకి పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా చేస్తుండంతో రామ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుండట. అదేంటంటే ఏకంగా 300 మంది ఫైటర్స్తో స్పెషల్ యాక్షన్ సీన్ను రూపొందిస్తున్నారట.
రామ్ వారందరితో తలపడనున్నారని తెలిసింది. ఈ సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్గా ఉండేలా.. బాగా పవర్ ఫుల్గా చిత్రీకరించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఈ మూవీ పొలిటికల్ టచ్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సీఎం పాత్రే ప్రతినాయకుడిగా కనిపిస్తారని సమాచారం.