గోంగూర రుచిని ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ప్రత్యేకమైన రుచి దీని సొంతం. గోంగూర రుచితో పాటు మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది ముఖ్యంగా గోంగూరలో అత్యధికంగా ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్స్ ఏ, సి, తోపాటు బీ కాంప్లెక్స్ విటమిన్లు అన్ని సమృద్ధిగా లభిస్తాయి. న్యూట్రిషన్ నిపుణుల సూచనల ప్రకారం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల, డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న గోంగూరను తప్పనిసరిగా ఆహారంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని తేలింది.
గోంగూరను తరచూ ఆహారంలో తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభించే సహజ యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ సి మనలో ఇమ్యూనిటీ బూస్టర్ గా ఉపయోగపడి సీజనల్గా వచ్చే దగ్గు, ఆయాసం , తుమ్ములు, జ్వరం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కంటి చూపు సమస్యలతో బాధపడేవారు గోంగూరను ఆహారంగా తీసుకుంటే ఇందులో లభించే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని రక్షించి కంటి చూపులు పెరుగుపరుస్తుంది అలాగే చర్మంపై మచ్చలు, ముడతలు, మొటిమలు వంటి సమస్యలను తగ్గించి వృద్ధాప్య ఛాయాలను అరికడుతుంది. గోంగూరలో సమృద్ధిగా ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల,దంతాల దృఢత్వానికి తోడ్పడి ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది.
అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు తరచూ గోంగూరను ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభించే పొటాషియం ఐరన్ రక్త ప్రసరణ వ్యవస్థను క్రమబద్ధీకరించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచూ గోంగూరను ఆహారంగా తీసుకుంటే రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది తద్వారా షుగర్ వ్యాధి అదుపు చేయబడుతుంది. గోంగూరలో ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి గుండె పోటు, ఉపకాయ సమస్యల ముప్పును తగ్గిస్తుంది.