కిడ్నీ సమస్యలు ఉన్నవారు మీల్ మేకర్ ను ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

అత్యధిక ప్రోటీన్స్ ఉన్న మీల్ మేకర్ ను సోయా గింజల నుంచి తయారు చేస్తారు. సోయా గింజల్లో నూనె తీసిన తర్వాత వచ్చే పదార్థంతో మీల్ మేకర్ తయారవుతుంది. మీల్ మేకర్ ను వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ బిర్యాని, పలావు, మసాలా కూరలు వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. శాఖాహారులు మీల్ మేకర్ తింటే మాంసాహారంతో సమానంగా ప్రోటీన్స్ లభ్యమవుతాయి.100 గ్రాముల మీల్ మేకర్ లో 52 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల్లో ఇతర విటమిన్స్, మినరల్స్,ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. మీల్ మేకర్ తినే విషయంలో చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి
వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మీల్ మేకర్ ను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మొదట తెలుసుకుందాం. మీల్ మేకర్ ను తరచూ తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా లభించి మన శరీరం శక్తివంతంగా తయారవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్దకం అజీర్తి గ్యాస్టిక్ వంటి సమస్యలు తొలగుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గి అధిక బరువు, ఉబకాయం, గుండె జబ్బు, మధుమేహం వంటి సమస్యలు నియంత్రించబడతాయి. మీల్ మేకర్ ను రోజుకు 25 గ్రాములు మించి తినకూడదని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీల్ మేకర్ ను తినడం వల్ల లాభాలు ఉన్నప్పటికి ఎక్కువ మోతాదులో తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రమాదకర స్థాయిలో పెరిగి కిడ్నీలో రాళ్ల సమస్యలు తలెత్తి కిడ్నీ దెబ్బ తినే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. కొందరిలో కీళ్ల నొప్పులు కాళ్లవాపులు, కండరాల వాపులు వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. మీల్ మేకర్ ఎక్కువగా తినడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు మోతాదుకు మించి పెరిగే అవకాశం. ఈస్ట్రోజన్ హార్మోన్ పురుషుల్లో ఎక్కువైతే రొమ్ముల పరిమాణం పెరిగే ప్రమాదం ఉంది. స్త్రీలలో అయితే హఠాత్తుగా శరీరంలో నీరు చేరి వాపు రావడం, రక్తస్రావం ఎక్కువగా ఇవ్వడం, కడుపులో వికారం, ముఖంపై మచ్చలు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. కావున మీల్ మేకర్ రుచిగా ఉన్నప్పటికీ తక్కువ మోతాదులో తీసుకోవడమే మన ఆరోగ్యానికి మంచిది.