డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడాలంటే ఇలా చేయండి?

ప్రతిరోజు కీరదోసను మన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను సహజ పద్ధతిలో పొందవచ్చు. కీర దోసకాయలో మన నిత్య జీవక్రియలకు అవసరమైన అన్ని పోషక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా కీరదోసలో అత్యధికంగా నీరు,పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తాయి కావున మన శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. మన శరీరానికి తగినంత నీటినీ అందించి డిహైడ్రేషన్ కు గురి కాకుండా కాపాడుతుంది. తరచూ కీరదోసను పచ్చిగా తింటే చాలా మంచిది. కీరదోసను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కీర దోసకాయలు సమృద్ధిగా పీచు పదార్థం అంటే ఫైబర్ లభిస్తుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం గ్యాస్ట్రిక్ అజీర్తి వంటి లక్షణాలను తొలగిస్తుంది. రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

కీర దోసలో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది ఇది రక్తనాళాలను శుద్ధిచేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది దాంతో అధిక రక్తపోటు సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు. గుండె ఆరోగ్యాన్ని రక్షించి గుండె జబ్బుల సమస్యను తగ్గిస్తుంది. కీరదోసలు పుష్కలంగా ఉండే విటమిన్స్ సి, యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలోని చెడు మలినాలను వ్యాధికారక క్రిములను తొలగించి అనేక క్యాన్సర్లను తరిమికొట్టడంతోపాటు మనలో ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది.

కీరదోసలు పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కీరదోసలు సమృద్ధిగా ఉన్న ఖనిజ లవణాలు కిడ్నీ సమస్యలను దూరం చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. కీరదోసలో పుష్కలంగా ఉన్న మెగ్నీషియం నాడీ కణాలను శాంతపరిచి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. మృత కణాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉరుదుగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కీరదోస ముక్కలను కంటిమీద ఉంచుకుంటే కంట్లో ఉన్న మలినాలు తొలగిపోయి కండ్ల మంటలను,కంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.