ఈ వేసవి సీజన్లో సబ్జా గింజలతో ఒంట్లో నీరసాన్ని తరిమి కొట్టండిలా?

వేసవి సీజన్ రావడంతో ప్రతి ఒక్కరూ వేసవి తాపం నుంచి రక్షణ పొందడం కోసం, ఒత్తిడి లేకుండా శరీరాన్ని ఉంచుకోవడం మొదలు పెట్టేసారు. మీ రోజువారి డైట్లు సబ్జా గింజలను చేర్చుకుంటే రోజు మొత్తం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతోపాటు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందించి జీవక్రియలను బ్యాలెన్స్ చేయడంలో ఎంతగానో తోడ్పడతాయి. సబ్జా గింజలు అన్ని రకాల విటమిన్స్ తోపాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.

సబ్జా గింజలను కాసేపు నీటిలో నానబెడితే మెత్తటి జల్ మాదిరిగా మారుతాయి.ఈ విత్తనాలను మనం తయారు చేసుకుని షరబత్, నిమ్మరసం, పుదీనా జ్యూస్, నన్నారి వంటి అన్ని రకాల జ్యూసుల్లో వేసుకొని సేవిస్తే అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే అన్ని ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కావున ఎండ వేడి నుంచి మనల్ని రక్షించి శరీరాన్ని డిహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడడమే కాకుండా అలసట ,నీరసం ఒత్తిడి వంటి మానసిక లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

సబ్జా గింజల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం, జింక్ విటమిన్ బి12, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించి మానసిక ఒత్తిడి తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. సబ్జా గింజల్లో ఉండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి చెడు వ్యర్ధాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా విసర్జక వ్యవస్థ బలోపేతం చేయడంలో సబ్జా గింజల పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఎండవేడికి మన శరీరం కోల్పోయే లవణాలను తిరిగి మనలో పెంపొందించడంలో సబ్జా గింజలు తోడ్పడతాయి. సబ్జా గింజలు ఎక్కువగా ఉండే ఐరన్ ,పోలిక్ యాసిడ్లు హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సహాయపడి ధర రక్త కణాల శాతాన్ని అందిస్తాయి.