ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన పండ్లు ఆహార పదార్థాలివే!

shutterstock-763518739-fruit-vendors-5-8wlk2

శీతాకాలంలో సహజంగా మనలో కొంత వ్యాధి నిరోధక శక్తి మందగించి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే కరోనా వైరస్ శీతాకాలంలో మనపై ఇంతలా ప్రభావం చూపడానికి మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడమే. దానికి తోడు దీర్ఘకాలిక వ్యాధులైన ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్, రుమటాయిడ్ వంటి కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారు శీతాకాలంలో కండరాలు నరాలు బిగుసుకుపోవడం వల్ల వీరిలో నొప్పి తీవ్రతను మాటల్లో వర్ణించలేము. ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు శీతాకాలంలో కొన్ని రకాల పండ్లను ఆహారంగా తీసుకుంటే ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

నిజానికి అన్ని రకాల తాజా పండ్లలో మన ఆరోగ్యానికి అవసరం విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి కావున సీజనల్ గా లభించే ప్రతి పండును ఆహారంగా తీసుకుంటూ మన శరీరంలో వ్యాధి కారకాలను తగ్గించడంలో సహాయపడి ఎముక, కండరాలు, నరాల క్షీణతను అరికట్టడంలో సహాయపడతాయి. శీతాకాలంలో అత్యధికంగా లభ్యమయ్యే ద్రాక్షలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, పాలిఫినాల్స్ ఎక్కువగా లభ్యమవుతాయి కావున కీళ్ల నొప్పులు, కీళ్లవాపుల సమస్య నుంచి మనల్ని రక్షిస్తాయి.

పుచ్చకాయలో ఎముకలు కండరాలను దృఢంగా ఉంచే విటమిన్స్, మినరల్స్ ,ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో శరీరంలోని లవణాలను బయటకు పంపడంలో సహాయపడి ఆర్థరైటి నొప్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పైనాపిల్ లో ఎక్కువగా ఉండే బ్రోమలై అనే ఎంజాయ్ కీళ్లవాపులను కీళ్లనొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. దానిమ్మ రసంలో అత్యధికంగా కాల్షియం, ఫాస్ఫరస్, పాలిఫినర్స్ లభ్యమవుతాయి. కావున వీటిని ఎక్కువగా తింటే కీళ్ల నొప్పులు సమస్య తగ్గడమే కాకుండా ఎముకలు దృఢంగా తయారవడంలో సహాయపడుతుంది. వీటితోపాటు చెర్రీస్, ఆఫ్రికాట్, స్ట్రాబెరీ వంటి పండ్లను ఎక్కువగా తింటే ఈ శీతాకాలంలో ఆర్థరైటిస్ నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.